30 ఏళ్ల ముందుచూపుతో.. | - | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల ముందుచూపుతో..

Apr 25 2025 1:04 AM | Updated on Apr 25 2025 1:04 AM

30 ఏళ

30 ఏళ్ల ముందుచూపుతో..

ఆలేరురూరల్‌: ఆలేరు మున్సిపాలిటీలో ముప్పై ఏళ్ల వరకు ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ఉండేలా ముందుచూపుతో అమృత్‌ 2.0 పథకం కింద చేపట్టిన రెండు ట్యాంకులు, 14 కిలోమీటర మేర పైపులైన్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు 2023 సెప్టెంబర్‌లోనే పాలన అనుమతులు లభించగా 2024 అక్టోబర్‌లో శంకుస్థాపన చేశారు. 20 నెలల్లో పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టు సంస్థతో యంత్రాంగం ఒప్పందం కుదుర్చుకుంది. పనులు పూర్తయితే మున్సిపాలిటీలో ముప్పైఏళ్ల వరకు తాగునీటి సమస్య ఉండదు.

ఆలేరును రెండు జోన్లుగా విభజించి..

ఆలేరు మున్సిపాలిటీని రెండు జోన్లుగా విభజించి పనులు చేపట్టారు. జోన్‌–1 రైల్వే ట్రాక్‌ ఉత్తర దిశలో నూతనంగా 7 లక్షల లీటర్లు, జోన్‌–2లో రైల్వే ట్రాక్‌కు దక్షిణ దిశలో 10 లక్షల లీటర్ల సామర్థ్యం గల రెండు ట్యాంకులను నిర్మిస్తున్నారు. ఈరెండింటి నిర్మాణానికి రూ.2.97 కోట్లు కాగా ఇంటింటికి నీటి సరఫరాకు అవసరమైన పైప్‌లైన్ల నిర్మాణాలకు రూ.1.63 కోట్లును కేటాయించారు. ఇతర పనులు, జీఎస్టీ తదితర చెల్లింపులకు రూ.6.49 కోట్లు, ఐదు సంవత్సరాల పాటు నీటి పథకాల నిర్వహణకు 87లక్షల రూపాయలు కేటాయించారు.

ట్యాంకుల నిర్మాణం ఎక్కడెక్కడంటే..

అమృత్‌–2 పథకం కింది ఆలేరు మున్సిపాలిటీలో రెండు భారీ నీటి ట్యాంకులు నిర్మిస్తున్నారు. ఇందులో ఒకటి ఆలేరులోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో, రెండోది కొలనుపాక రోడ్డు పాత మున్సిపాలిటీ భవనం వద్ద నిర్మిస్తున్నారు. కళాశాలలో ట్యాంకు నిర్మాణ పనులు పూర్తికావొస్తుండగా పాత మున్సిపల్‌ భవనం వద్ద నిర్మాణ పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతున్నాయి.

త్వరలోనే పనులు పూర్తిచేస్తాం

ఆలేరు ప్రజలకు అమృత్‌ పథకం 2.0 కింద తాగనీరు అందించడానికి రెండు భారీ ట్యాంకులు నిర్మిస్తున్నాం. త్వరలోనే పనులు పూర్తి చేసి ట్యాంకులను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇస్తాం. దీంతో 30 ఏళ్ల వరకు తాగునీరు సమస్య ఉండదు.

– బి.శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఆలేరు

ఫ ఆలేరు మున్సిపాలిటీలో

కొనసాగుతున్న అమృత్‌ 2.0 పనులు

ఫ రెండు చోట్ల భారీ నీటి ట్యాంకులు

ఫ 14 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మాణం

ఫ త్వరలోనే పూర్తికానున్న పనులు

ఫ మున్సిపాలిటీలో తీరనున్న నీటికష్టాలు

నిధుల కేటాయింపు ఇలా.. (రూ.కోట్లలో..)

మంజూరైన నిధులు 12

ట్యాంకుల నిర్మాణానికి 2.97

పైప్‌లైన్‌ పనులకు 1.63

మరో ఏడు రకాల పనులకు 3.75

ఇతర చెల్లింపులకు 2.74

పథకం నిర్వహణకు 87లక్షలు

ఆలేరు మున్సిపాలిటీ వివరాలు

మొత్తం వార్డులు 12

నివాసగృహాలు 4,877

నల్లా కనెక్షన్లు 4,650

నీళ్ల ట్యాంకులు 27

మున్సిపల్‌ బోర్లు 49

అద్దె బోర్లు 06

నీటి సరఫరా 1.6 ఎంఎల్‌డీ

30 ఏళ్ల ముందుచూపుతో..1
1/1

30 ఏళ్ల ముందుచూపుతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement