‘భూ భారతి’తో సాదాబైనామాలకు మోక్షం
భూదాన్‌పోచంపల్లి : భూ భారతి చట్టంతో సాదాౖబైనామాలకు మోక్షం లభించనుందని, తద్వారా 10 లక్షల మందికి మేలు జరుగుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి పట్టణంలోని జెడ్పీ హైస్కూల్‌లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతితో భూ సమస్యలన్నీ పరిష్కారమవుతాయన్నారు. జిల్లాలో భూదానోద్యమానికి శ్రీకారం చుట్టిన భూదాన్‌పోచంపల్లిని పైలట్ మండలంగా ఎంపిక చేయాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం మండలంలో 67 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారిణి రమణి, పోచంపల్లి ఇన్‌చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి, భువనగిరి వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ రేఖాబాబురావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామ మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు పాక మల్లేశ్‌యాదవ్, భారత లవకుమార్, జిల్లా నాయకులు తడక వెంకటేశం, సామ మధుసూధన్‌రెడ్డి, కళ్లెం రాఘవరెడ్డి, మర్రి నర్సింహారెడ్డి, కొట్టం కరుణాకర్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ డైరెక్టర్లు కుక్క దానయ్య, మద్ది అంజిరెడ్డి, మర్రి రాజిరెడ్డి, సుర్వి వెంకటేశ్‌గౌడ్, ఏర్పుల శ్రీనివాస్, తోట శ్రీనివాస్, పక్కీరు నర్సిరెడ్డి, కాసుల అంజయ్య, ఉపునూతుల వెంకటేశం, గునిగంటి వెంకటేశ్, కుక్క కుమార్, చెన్నబత్తిని యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం
అనిల్‌కుమార్‌రెడ్డి
‘భూ భారతి’తో సాదాబైనామాలకు మోక్షం


