నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీని ఆదుకోవాలి
ఆలేరురూరల్: నష్టాల్లో ఉన్న మదర్ డెయిరీకి రూ.50 కోట్లు ఇచ్చి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆలేరులోని వైఎస్‌ఎన్ గార్డెన్‌లో జరిగిన తెలంగాణ పాల రైతుల రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. మదర్, విజయ, కరీంనగర్, ముల్కనూర్ డెయిరీలతో పాటు ప్రైవేట్ డెయిరీలు తక్కువ రేటుకే పాల సేకరణ చేసి రైతులకు నష్ట చేకుర్చుతున్నారన్నారు. మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకపోయిందని ఆస్తులను అమ్మాలని పాలకవర్గం నిర్ణయించడం దారుణమన్నారు. నష్టాలకు కారణం రైతులు కాదని పాలకవర్గాలు చేసిన తప్పిదాలేనని పేర్కొన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌ను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లీటర్ పాల ధరకు రూ.5 ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమిలేని వారికి, వ్యవసాయ కార్మికులకు 90 శాతం సబ్సిడీపై పాడి పశువులను పంపిణీ చేయాలని కోరారు. పాల రైతులకు రూ.3 లక్షలు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సదస్సులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య, నర్సింహులు, పోతిరెడ్డి సుదర్శన్, తీగల సాగర్, బొంతల చంద్రారెడ్డి, జంగారెడ్డి, మేక అశోక్, బాలరాజు, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, సంజీవ్‌రెడ్డి, దొంతిరి సోమిరెడ్డి, భిక్షపతి, సత్తిరెడ్డి, పోశెట్టి, భాస్కర్, నాగరాజు, సురేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
జూలకంటి రంగారెడ్డి


