ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 8మంది రిమాండ్
హుజూర్‌నగర్: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న 8మందిని పోలీసులు అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు సోమవారం విలేకరులకు వెల్లడించారు. హుజూర్‌నగర్‌కు చెందిన షేక్ ఖలీముద్దీన్, షేక్ అయూబ్ పాషా, పొట్టేపంగు కాటయ్య, తిరుమలశెట్టి రామమోహన్‌రావు, సామల నర్సింహారెడ్డి, మేళ్లచెరువు మండలం నల్ల బండగూడేనికి చెందిన తోడేటి గోపికృష్ణ, గరిడేపల్లి మండలం రాయినిగూడేనికి చెందిన వాడపల్లి నర్సింహారావు, ఏపీలోని విజయవాడకు చెందిన పొట్టి కోటయ్య సులువుగా డబ్బులు సంపాదించాలని ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఆన్‌లైన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు బెట్టింగ్ పెడుతున్నారు. బెట్టింగ్ పెట్టగా వచ్చిన డబ్బులు పంచుకుందామని వీరు ఆదివారం హుజూర్‌నగర్ పట్టణంలోని ఓ దుకాణం వద్దకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 సెల్‌ఫోన్లు, రూ.3,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరి బెట్టింగ్ యాప్‌లలో ఉన్న రూ.66,067ను ఫ్రీజ్ చేసి, సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ ముత్తయ్య, ఏఎస్‌ఐ బలరాంరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


