గొర్రెల కాపరుల సమస్యలు పరిష్కరిస్తా
యాదగిరిగుట్ట: గొర్రెల కాపరుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆదివారం యాదగిరిగుట్టలో నిర్వహించిన గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం ఆవిర్భావ మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గొల్ల కురుమ బిడ్డగా గొర్రెల కాపరుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని, నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లి పరిష్కరిస్తానని పేర్కొన్నారు. కాపరులు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తేవాలన్నారు. అంతకు ముందు బీసీ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


