లక్ష్యం దిశగా అడుగులు
వంద శాతం వసూలు చేస్తాం
వంద శాతం పన్ను వసూలు లక్ష్యం దిశగా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పన్ను చెల్లింపుతో గ్రామాల అభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగిస్తారో వివరిస్తున్నాం. మొండి బకాయిదారుల నుంచి కూడా పన్ను వసూలు చేస్తున్నాం.
– సునంద. జిల్లా పంచాయతీ అధికారి
భువనగిరిటౌన్: జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల్లోని పంచాయతీ విభాగం పన్నుల వసూళ్లలో దూకుడు ప్రదర్శిస్తోంది. 2024– 25 ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో 20 రోజులు మిగిలి ఉంది. ఇప్పటికి దాదాపు 79 శాతం పన్నుల వసూళ్లు జరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి లక్ష్యానికి చేరుకునేందుకు పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు.
11 మండలాల్లో 80శాతానికి పైగా వసూళ్లు
జిల్లా వ్యాప్తంగా 17 మండలాలకు 11 మండలాల్లో 80శాతం పైగా పన్ను వసూలు చేశారు. నారాయణపురం మండలం 91శాతం, ఆత్మకూర్‌లో 88 శాతం, పోచంపల్లిలో 85శాతం వసూలు చేయగా.. బీబీనగర్, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్ మండలాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. పన్ను వసూళ్లలో వెనుకబడ్డ మండలాలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అధికారులు, సిబ్బందికి సూచిస్తున్నారు. వెనుకబడ్డ గ్రామాలను గుర్తించి గ్రామాల వారీగా పురోగతి తెలుసుకొని, తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి లక్ష్యాన్ని సాధించేలా పంచాయతీ కార్యదర్శులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అవసరమైతే జిల్లాస్థాయి అధికారులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి పన్ను చెల్లిస్తే కలిగే లాభాలను ప్రజలకు వివరిస్తున్నారు. జిల్లాలో 428 గ్రామ పంచాయతీలు ఉండగా 2,03232 నివాసాలు ఉన్నాయి. మండలాల వారీగా 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (పన్నుల డిమాండ్) ఆధారంగా లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. జిల్లా మొత్తంలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 16,95,85,230 వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రూ. 13,47,30,773 వసూలు చేయగా, రూ. 3,38,49,457 వసూలు చేయాల్సి ఉంది. అంటే ఇంకా 21 శాతం వసూలు చేయాలి.
ఫ గ్రామాల్లో 79 శాతం పన్ను వసూళ్లు
ఫ ఈ ఆర్థిక సంవత్సరానికి
రూ. 16,95,85,230
వసూలు చేయాలని లక్ష్యం
ఫ ఇప్పటివరకు
రూ. 13,47,30,773 వసూలు
ఫ స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పంచాయతీ అధికారులు
లక్ష్యం దిశగా అడుగులు


