విద్యుత్‌ సిబ్బందిపై దాడి.. పలువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

Feb 25 2023 11:32 AM | Updated on Feb 26 2023 5:51 AM

వలిగొండ : విద్యుత్‌ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన శుక్రవారం రాత్రి వలిగొండలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండకు చెందిన బల్లెపు కృష్ణస్వామి తన ఇంటి కరెంట్‌ బిల్లు బకాయి పడ్డాడు. దీంతో విద్యుత్‌ సిబ్బంది కరెంట్‌ సరఫరా నిలిపివేశారు. ఆగ్రహించిన కృష్ణస్వామి కళ్లెం నరేష్‌, వేముల నర్సింహ, గుర్తుతెలియని వ్యక్తితో కలిసి విద్యుత్‌ కార్యాలయానికి వెళ్లి నల్ల రాములుపై ఇనుప రాడ్డు తో దాడి చేశారు.అడ్డుకోబోయిన ముగ్గురు విద్యుత్‌ పైనా దాడికి దిగారు. కార్యాలయం తలుపులను ధ్వసం చేశారు. గాయపడ్డ వారిని రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement