ఏజెన్సీలో రీకౌంటింగ్ హడావుడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పంచాయతీల్లో గెలుపే లక్ష్యంగా కూటమి కుట్రలకు తెగబడింది.. బేరసారాలు, బెదిరింపులకు లొంగకపోతే కొన్నిచోట్ల పో లీస్ బలప్రయోగం చేయించింది.. తప్పుడు కేసులతో వేధించింది.. ఎన్నికల ప్రచారాన్ని సైతం అడ్డుకోవడానికి అరెస్టు చేసి అలజడి సృష్టించింది.. వీటన్నింటినీ బలంగా తట్టుకుని వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు బరిలో నిలిచి సత్తాచాటారు. మొత్తంగా మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లోని మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించారు.
తొలిదశలో 68 స్థానాల్లో..
జిల్లాలో తొలి దశలో చింతలపూడి, పోలవరం ని యోజకవర్గాల్లోని 11 మండలాల్లో 177 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మద్దతుదారులు 68 స్థానాలు, టీడీపీ 75 స్థానాలు, జనసేన 13 స్థానాలు, స్వతంత్రులు 3 చోట్లు, సీపీఐ ఒక స్థానం, సీపీఐ (ఎంఎల్) 4 స్థానాల్లో గెలుపొందారు. స్వతంత్రుల్లో ఒకరు వైఎస్సార్‌సీపీ మద్దతుతో గెలిచారు. ఈ పరిణామాల క్రమంలో రెండు నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్న మేజర్ పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ క్వీన్ స్లీప్ చేసింది.
మేజర్ పంచాయతీల్లో ఇలా..
● చింతలపూడి మండలం ప్రగడవరంలో 10,873 మంది ఓటర్లు, 16 వార్డులు ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ మద్దతుదారులు సమానంగా వా ర్డులు గెలుచుకోగా.. వైఎస్సార్‌సీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుంటక వరలక్ష్మి 256 ఓట్లతో విజయం సాధించారు.
● యర్రగుంటపల్లిలో 5,080 ఓట్టు కాగా వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కె.సీతారామరెడ్డి 227 ఓట్ల మెజార్టీతో గెలుపొదారు.
● యండపల్లిలో కుట్ర రాజకీయాలు నామినేషన్ల రోజునే కొనసాగాయి. వైఎస్సార్‌సీపీ మద్దతుతో 80 ఏళ్ల వృద్ధురాలు మోరంపూడి నాగశిరోమణి బరిలో నిలవగా ఆమె కుమారుడు శ్రీనివాస్ పంచాయతీలో ప్రచారం మొదలుకొని అన్ని బాధ్య తలు చూసుకున్నారు. ఈ క్రమంలో ఓటమి భయంతో టీడీపీ హడావుడికి తెరతీసింది. తనపై దాడి జరుగుతుందనే సమాచారంతో శ్రీనివాస్ అప్రమత్తం కావడంతో ఆయన అనుచరులపై దాడి చేశారు. తిరిగి శ్రీనివాస్‌పైనే హత్యాయత్నం కేసు నమోదు చేసి చింతలపూడి సీఐ క్రాంతికుమార్ నేతృత్వంలో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయినా ఎన్నికల బరిలో వెనక్కి తగ్గకుండా నాగశిరోమణి విజయం సాధించారు.
● కామవరపుకోటలో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు నల్లూరి ప్రభాకర్‌పై మద్యం నిల్వ అక్రమ కేసు నమోదు చేశారు. ప్రభాకర్, ప్రభాకర్ తండ్రిపై పోలీసులు కేసు కట్టి ఒత్తిడి పెంచారు. 14,278 ఓట్లు ఉన్న మేజర్ పంచాయతీలో ప్రభాకర్ విజయం సాధించారు.
మరోవైపు తాట్కూరుగొమ్ములో 22 ఓట్లతో వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలిస్తే రీకౌంటింగ్ పేరుతో హడావుడి చేశారు. ధ్రువీకరణ పత్రం ఇచ్చాకా కూడా టీడీపీ శ్రేణులు ధర్నా నిర్వహించి నానా హంగామా సృష్టించారు. దీనికి కొ నసాగింపుగా శుక్రవారం కూడా టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొరగం శ్రీనివాస్ ఆందోళన కొనసాగించారు. అలాగే కన్నాపురంలో టీడీపీ అభ్యర్థి 12 ఓట్లతో గెలిచినట్టు హడావుడిగా ప్రకటించడంతో వెంటనే అభ్యర్థి ర్యాలీ కూడా ప్రారంభించేశారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కొడాలి సూర్యకుమారి రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో రీకౌంటింగ్ నిర్వహించగా ఆమె 10 ఓట్లతో విజయం సాధించారు.
పల్లె పోరు.. ఫ్యాన్ జోరు
ఏజెన్సీ, మెట్ట గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ హవా
చింతలపూడి మండలంలో పోలీసుల వేధింపుల పర్వం
హత్యాయత్నం, అక్రమ మద్యం నిల్వ కేసులతో వేధింపులు
యండపల్లిలో అభ్యర్థి నాగశిరోమణి కుమారుడిపై హత్యాయత్నం కేసు
కామవరపుకోటలో సర్పంచ్‌పై అక్రమ మద్యం నిల్వ కేసులు
అధికార పార్టీ కుట్రలు దాటి వైఎస్సార్‌సీపీ గెలుపు


