● ఎట్టకేలకు సర్పంచ్‌గా లక్ష్మీదుర్గ గెలుపు
● రాత్రంతా కౌంటింగ్
● వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థిని విజయం
నరసాపురం రూరల్: మండలంలోని లక్ష్మణేశ్వరంలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అభ్యర్థిని పరసా వెంకటస్వామి కోడలు పరసా లక్ష్మీదుర్గ విజయం సాధించారు. గెలుపును తట్టుకోలేని కూటమి పార్టీల అభ్యర్థితోపాటు మరికొందరు కౌంటింగ్‌లో అవతవకలు జరిగాయని ఆందోళన చేశారు. పోలైన ఓట్లు లెక్కించిన ఓట్లకి మధ్య తేడా ఉందని ఘర్షణ సృష్టించారు. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయంఏర్పడగా శుక్రవారం వేకువజాము వరకూ హైడ్రామా నడిచింది. ఆర్డీఓ దాసి రాజు హుటాహుటిన కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ఇరుపార్టీల అభ్యర్ధులు, వారి మద్దతుదారులకు నచ్చ చెప్పారు. అనంతరం పరసా లక్ష్మీదుర్గ సర్పంచ్‌గా గెలిచినట్టు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు. అనంతరం కౌంటింగ్ కేంద్రం బయట సర్పంచ్ లక్ష్మీదుర్గతో కలిసి వైఎస్సార్‌సీపీ నాయకులు చాగంటి సత్యనారాయణ, పెండ్ర వీరన్న, పప్పుల రామారావు, అండ్రాజు చల్లారావు, మత్తే సువర్ణరాజు తదితరులు మాట్లాడుతూ ఈ విజయం లక్ష్మణేశ్వరం గ్రామంలోని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు అంకితమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయడమే మనందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.


