బియ్యం కేంద్రాల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

బియ్యం కేంద్రాల తనిఖీ

Nov 28 2026 1:50 AM | Updated on Nov 28 2026 1:50 AM

బియ్యం కేంద్రాల తనిఖీ ఎరువుల యాప్‌పై శిక్షణ పారా రకీడా పోటీలు బాల్య వివాహాలతో అనర్థాలు

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరంలో బియ్యం విక్రయ కేంద్రాలను ఇన్‌చార్జి కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. చినరంగనిపాలెంలోని మాల్యాద్రి రైస్‌ షాప్‌లో నిల్వలు, విక్రయ ధరలను పరిశీలించారు. అ నంతరం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ఏర్పాటు చేసిన ధరణి బియ్యం కౌంటర్‌ను తనిఖీ చేసి విక్రయాలను పరిశీలించారు. ఇక్కడ కిలో రూ.50కు నాణ్యమైన బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు చెప్పారు. ఆయా విక్రయ కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. డీఎస్‌ఓ ఎన్‌.సరోజ, ఏఎస్‌ఓ రవిశంకర్‌ ఉన్నారు.

భక్త కనకదాసు జయంతి

కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భక్త కనకదాసు జయంత్రి ఉత్సవాన్ని నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ కల్పశ్రీ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు గొప్ప భక్తుడే కాకుండా ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త అని కొనియాడారు. కర్ణాటక సంగీతానికి సంబంధించి కన్నడలో ఆయన రచించిన కీర్తనలు విశేష ప్రాచుర్యం పొందాయన్నారు. డీఆర్వో పి.గ్లోరియా, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కె.అప్పారావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అరుణకుమారి, డ్వామా పీడీ అప్పారావు పాల్గొన్నారు.

పాలకోడేరు: డిజిటల్‌ పద్ధతిలో ఎరువుల కొనుగోలు పథకం (ఎఫ్‌ఎఫ్‌ఎస్‌) యాప్‌పై డివిజన్‌ స్థాయి రైతు సేవా సిబ్బందికి శుక్రవారం గొర గనమూడి శిక్షణ ఇచ్చారు. భీమవరం ఏడీఏ కేఏఎస్‌ఎస్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్థాయిలో పనిచేస్తున్న వ్య వసాయ సిబ్బందికి యాప్‌ వినియోగంపై అ వగాహన కల్పించారు. ఏడీఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ యాప్‌పై పూర్తి అవగాహన పెంచుకుని, ఈ యాప్‌ ద్వారా ఎరువుల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే గ్రామంలోని ప్రతి రైతుకు ఫార్మర్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాలని, రైతులంతా ఈ ఐడీ పొందేలా వ్యవసాయ సిబ్బంది చర్యలు తీసుకోవాలరు. మండల వ్యవసాయాధికారి బి.సంధ్య, వీరవాసరం మండల వ్యవసాయాధికారి బెన్సీ బాబు థామస్‌తో పాటు డివిజన్‌ పరిధిలోని రైతు సేవా సిబ్బంది పాల్గొన్నారు.

భీమవరం: స్థానిక డీఎన్నార్‌ కాలేజీలో శుక్రవారం పారా క్రీడా పోటీలను జేసీ కల్పశ్రీ ప్రారంభించారు. పోటీలు ఆరు విభాగాల్లో జరిగాయని, 67 మంది పాల్గొనగా 38 మంది జిల్లాస్థాయిలో ఎంపికయ్యారని జిల్లా స్పోర్ట్స్‌ అధికారి ఎన్‌.మోహన్‌దాస్‌ తెలిపారు. బాలురు విభాగంలో 21 మంది, బాలికల విభాగంలో నలుగురు, బ్యాడ్మింటన్‌లో బాలురు విభాగంలో నలుగురు, టైక్వాండో బాలుర విభాగంలో నలుగురు, బాలికల విభాగంలో ముగ్గురు, బ్లైండ్‌ గోల్బాల్‌ బాలుర విభాగంలో ఒకరు, బాలికల విభాగంలో ఒకరు ఎంపికయ్యారన్నారు. వీరంతా వచ్చేనెల 1, 2 తేదీల్లో విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): బాలల జీవితాలను బాల్య వివాహాలు చీకటిలోకి నెడుతున్నాయని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్‌.శ్రీలక్ష్మి అన్నారు. జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథిగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ బాలల జీవితాల్లో కాంతులు నింపటానికి చిహ్నంగా ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. ప్రజలు బాల్య వివాహాల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తప్పనిసరిగా చేరవేసి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని సూచించారు. సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.శారద, జిల్లా బాలల సంరక్షణాధికారి సీహెచ్‌ సూర్య చక్రవేణి, డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement