స్కేటింగ్ క్రీడాకారుల ప్రతిభ
చైర్‌పర్సన్ అభ్యర్థులుగా..
న్యూస్‌రీల్
ఈపీఎఫ్ పింఛన్ పెంచాలి
ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈపీఎఫ్ కనీస పింఛన్ రూ.7,500కు పెంచాలని ఐఎఫ్‌టీయూ నాయకులు ధర్నా చేశారు. 8లో u
మంగళవారం శ్రీ 17 శ్రీ నవంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: మలివిడత పుర పోరులో మొదటి అంకం పరిసమాప్తమైంది. సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది. అత్యధికంగా పాలకొల్లు మున్సిపాల్టీలో 321 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం అధికారులు వాటిని పరిశీలించనున్నారు. మరోపక్క తొలి విడతలోని 90 పంచాయతీల్లో మంగళవారంతో నామినేషన్లకు గడువు ముగియనుంది. రెండో రోజు సర్పంచ్ పదవులకు 349 నామినేషన్లు దాఖలయ్యాయి.
అనుచరగణంతో అట్టహాసంగా..
పట్టణాల్లో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో అభ్యర్థులు తీన్‌మార్ డప్పులు, అనుచరగణంతో అట్టహాసంగా మున్సిపల్ కార్యాలయా లకు చేరుకుని నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు, వారి వెంట వచ్చిన జనంతో నామినేషన్ కేంద్రాలు కిటకిటలాడాయి. మూడు రోజుల్లో మొత్తంగా నాలుగు చైర్మన్ స్థానాలకు 53 నామినేషన్లు రాగా, 188 వార్డుల కోసం 1,192 నామినేషన్లు వచ్చాయి. మంగళవారం నామినేషన్ల పరిశీలన జరుగనుంది.
వార్డులకు 1,192 నామినేషన్లు
జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల పరిధిలో 188 వార్డులకు గాను చివరి రోజు 876 నామినేషన్లు రాగా మూడు రోజుల్లో మొత్తం 1,192 నామినేషన్లు వచ్చాయి.
● భీమవరంలో 147 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టణంలో 52 వార్డులకు మూడు రోజుల్లో మొత్తం 340 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వైఎస్సార్‌సీపీ నుంచి 86, స్వతంత్రులుగా 74, టీడీపీ 61, జనసేన 69, బీజేపీ 36, కాంగ్రెస్ 10, సీపీఎం నాలుగు ఉన్నాయి.
● తాడేపల్లిగూడెంలో 235 నామినేషన్లు వచ్చాయి. 48 వార్డులకు మొత్తం 304 నామినేషన్లు రాగా వైఎస్సార్‌సీపీ నుంచి 92, జనసేన 100, టీడీపీ 74, బీజేపీ 14, స్వతంత్రులు 16, సీపీఎం ఆరు, బీఎస్పీ ఒకటి, సీపీఐ ఒకటి ఉన్నాయి.
● తణుకులో 173 నామినేషన్లు దాఖలు కాగా మూడు రోజుల్లో మొత్తం 199 నామినేషన్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నుంచి 79, టీడీపీ 65, జనసేన 19, బీజేపీ 12, కాంగ్రెస్ 12, ఇతరులు ఏడు, బీఎస్సీ మూడు, సీపీఐ ఒకటి, సీపీఎం ఒకటి ఉన్నాయి.
● పాలకొల్లులో 44 వార్డులకు 321 నామినేషన్లు రాగా, మూడు రోజుల్లో మొత్తం 349 వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నుంచి 94 నామినేషన్లు దాఖలు కాగా టీడీపీ 164, జనసేన 32, బీజేపీ 15, కాంగ్రెస్ ఆరు, బీఎస్పీ మూడు, ఇతరులు 35 మంది ఉన్నారు.
పంచాయతీలోనూ జోరు
సప్తమి కలిసిరావడంతో జిల్లాలో తొలివిడతగా ఎ న్నికలు జరుగుతున్న ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లోని 90 పంచాయతీల్లో సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థులుగా 349 నామినేషన్లు దాఖల య్యాయి. రెండు రోజుల్లో మొత్తం 427 నామినేషన్లు వచ్చాయి. 1,006 వార్డులకు ఆదివారం 206, సోమవారం 1,355 నామినేషన్లతో మొత్తం 1,561 వచ్చాయి. తొలివిడతలో పంచాయతీల్లో నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియనుంది.
తణుకులో నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి బలరామకృష్ణ. చిత్రంలో ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, పరిశీలకుడు నాగు
భీమవరంలో నామినేషన్ దాఖలు చేస్తున్న
వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి యాదాల మాధవీలత
పాలకొల్లులో నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి చందక ఉమాశైలజ
తాడేపల్లిగూడెంలో వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి గొర్రెల శ్రీనివాసు తరఫున నామినేషన్ సమర్పిస్తున్న ఆయన తనయుడు భార్గవ్‌కుమార్
ఏలూరు ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందిన పలువురు స్కేటింగ్ క్రీడాకారులు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చారు. పతకాలతో సత్తాచాటారు. 8లో u
భీమవరంలో చైర్‌పర్సన్ పదవికి తొమ్మిది నామినేషన్లు రాగా వైఎస్సార్‌సీపీ నుంచి యాదాల మాధవీలత నామినేషన్ దాఖలు చేయగా, చుండూరి మల్లేశ్వరి (జనసేన), పుచ్చకాయల శిరీష (కాంగ్రెస్) తదితరులు ఉన్నారు.
తాడేపల్లిగూడెంలో పది నామినేషన్లు రాగా వైఎస్సార్‌సీపీ నుంచి కొప్పుల వెలమ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ గొర్రెల శ్రీనివాస్, పా లూరి వెంకటేశ్వరరావు (జనసేన), మా ర్నిడీ బాబ్జి (కాంగ్రెస్), మండల నాగేశ్వరరావు (సీపీఐ) తదితరులు పోటీలో ఉన్నారు.
తణుకులో ఎనిమిది నామినేషన్లకు వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థిగా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యిండుగపల్లి బలరామకృష్ణ, బసవ వీరవెంకటసత్య రామకృష్ణ (టీడీపీ), కడలి రామారావు (కాంగ్రెస్) తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు.
పాలకొల్లులో మొత్తం 26 నామినేషన్లు వచ్చాయి. వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా చందక ఉమాశైలజ నామినేషన్ దాఖలు చేయగా ఆబోతుల ఉషారాణి (టీడీపీ), కర్నేని రోజా రమణి (స్వతంత్ర), షేక్ అమీనా (కాంగ్రెస్) తదితరులు ఉన్నారు.
నామినేషన్ల సందడి
మున్సిపాల్టీల్లో చివరి రోజు నామినేషన్ల జోరు
అత్యధికంగా పాలకొల్లులో 321 నామినేషన్లు
నేడు పరిశీలన
90 పంచాయతీల్లో నేటితో ముగియనున్న గడువు


