చించినాడ వంతెనపై రోడ్డు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

చించినాడ వంతెనపై రోడ్డు మరమ్మతులు

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

చించినాడ వంతెనపై రోడ్డు మరమ్మతులు భారీ వర్షాలపై అప్రమత్తం జనగణన రెండో విడత శిక్షణ

చించినాడ వద్ద గోదావరి వంతెనపై ప్రమాదకరంగా మారిన గోతుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఈ నెల 13న ‘సాక్షి’లో ‘నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల’ పేరిట ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. వంతెనపై పడిన రంధ్రాలకు మరమ్మతులు చేపట్టి గోతులను పూడ్పించారు. ‘సాక్షి’కి వాహనచోదకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. –యలమంచిలి

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో ఈనెల 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి సూచించారు. సోమ వారం కలెక్టరేట్‌ నుంచి గూగుల్‌ మీట్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అత్యవసర సేవల సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు, సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జనగణన–2027 రెండో విడతకు సంబంధించి ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం నుంచి 18 వరకు, 19 నుంచి 21 వరకు రెండు బ్యాచ్‌లుగా నిర్వహించనున్నట్టు జేసీ కేఆర్‌ కల్పశ్రీ తెలిపారు. కలెక్టరేట్‌లో జనగణన రెండో విడత శిక్షణ కార్యక్రమాన్నిప్రారంభించారు. జనగణన జాయింట్‌ డైరెక్టర్లు జగన్నాథ్‌ మాజీ, మోహిత్‌ పాల్గొన్నారని తెలిపారు. జనగణన ప్రక్రియ, సమాచార సేకరణ, నిబంధనలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement