పాలకొల్లు టీడీపీలో అసమ్మతి రాగం | - | Sakshi
Sakshi News home page

పాలకొల్లు టీడీపీలో అసమ్మతి రాగం

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

● మంత్రికి తలనొప్పిగా అభ్యర్థుల ఎంపిక

● ఇండిపెండెంట్లుగా బరిలో తెలుగు తమ్ముళ్లు

● 19 లోపు బుజ్జగిస్తారా.. బరిలో నిలుస్తారా?

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు టీడీపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది. అభ్యర్థుల తుది జాబితా వెల్లడి కాకపోవడం, వార్డు అభ్యర్థులు, చైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపిక మంత్రి నిమ్మల రామానాయుడికి తలనొప్పిగా మారింది. మంత్రి రామానాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత తొలి మున్సిపల్‌ ఎన్నికలు కావడంతో ఇప్పటివరకూ మొహం చాటేసిన తమ్ముళ్లు తమ కు సీటు కావాలంటే తమకు అంటూ పోటీ పడుతు న్నారు. మంత్రి నచ్చిన వారికి సీటిస్తే తాము ఊరు కోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల తుది జాబితా 19న వెలువడనుందని, తాము కూడా నామినేషన్‌ వేస్తామంటూ పలువురు అసమ్మతివాదులు బరిలో నిలిచారు. పార్టీ మ్యాండె ట్‌ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటా మని అంటున్నారు. ఇలా పట్టణంలో దాదాపు ఐదుగురు కూటమి సభ్యులు మంత్రిని ఎదిరించి బరిలో దిగారు. ఒక వార్డులో టీడీపీని వదిలి మిగిలిన పా ర్టీల మద్దతుతో జనసేన అభ్యర్థి బరిలో దిగుతున్న ట్టు తెలిసింది. జనసేన నాయకులైతే టీడీపీ నేతలు ఇండిపెండెంట్లుగా బరిలో దిగినా తమకు నష్టమేమి లేదనే భరోసాతో ఉన్నారు. కూటమిలో టీడీపీ నా యకులు మిత్రధర్మం పాటించకుండా స్వతంత్ర అభ్యర్థులుగా దిగుతామంటే తాము నష్టపోయేది 7 వార్డులేనని.. అదే తాము కూడా టీడీపీకి సహకరించకూడదని అనుకుంటే 34 వార్డుల్లో వారికి ఇబ్బందులు తప్పవని జనసేన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలబడతానని చెప్పడంతో ఓ సభ్యుడి వద్దకు వెళ్లి మంతనాలు జరిపి సీటు వారికే కేటాయించినట్టు తెలిసింది.

తేలని చైర్‌పర్సన్‌ ‘పంచాయితీ’

టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థినిగా ఆబోతుల ఉషారాణిని ప్రకటించినా.. కర్నేన రోజారమణి కూడా బరిలో నిలిచారు. 19న నామినేషన్ల ఉపసంహరణ సమయానికి తనకు పార్టీ మ్యాండెట్‌ వస్తుందని ఆ శిస్తున్నట్టు చెబుతూ ఆమె ముందస్తు ప్రచారం కూ డా ప్రారంభించారు. ఆమె స్వతంత్ర అభ్యర్థినిగా పోటీలో ఉంటే టీడీపీకి నష్టం తప్పదని తెలుగు తమ్ముళ్లలో గుబులు పట్టుకుంది.

బీజేపీ సీనియర్‌కు మొండిచేయి

పట్టణంలోని 44 వార్డులో టీడీపీ 34, జనసేన 7, బీజేపీకి 3 వార్డులు కేటాయించారు. వార్డులు కేటా యిందామంటే జనసేనలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు లేరు.. ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఉన్న బీజేపీకి వార్డులు లేని పరిస్థితి. తొలి నుంచి జనసేన 9, బీజేపీ 4 వార్డుల కోసం పోటీపడుతూ వచ్చారు. చర్చల్లో భాగంగా జనసేనకు 7, బీజేపీకి 3 వార్డులు మాత్రమే కేటాయించారు. మరో వార్డుకు సోమవారం మధ్యాహ్నం 11 గంటల వరకు పోరాటం సాగింది. ఈ క్రమంలో బీజేపీ సీనియర్‌ నేతకు వార్డు లేకుండా చేయడం గమనార్హం. ఓ సందర్భంలో జనసేన నుంచి పోటీ చేయాలని ఆయనకు సూ చించడంతో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. భర్త ఒక పార్టీ, భార్య మరో పార్టీ నుంచి పోటీచేయాలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన పోటీ నుంచి వైదొలగినట్టు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement