సాగునీటికి పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సాగునీటికి పటిష్ట ఏర్పాట్లు

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

సాగునీటికి పటిష్ట ఏర్పాట్లు వచ్చే నెలలో బాలోత్సవం పుస్తక పఠనంతో విజ్ఞానం 18 గ్రంథాలయాల డిజిటలైజేషన్‌ పూర్తి

భీమవరం: దాళ్వా వరిసాగులో జిల్లాలో నూరు శాతం శివారు ప్రాంతాల చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడుతూ వారాబందీ విధానం అమలు చేయాలని, తీర ప్రాంతాల్లో ఉప్పునీటి చొరబాటును అరికట్టేందుకు క్రాస్‌ బండ్లు ఏర్పాటు చేయాలన్నారు. దాళ్వా సాగుకు వచ్చేనెల 1 నుంచి మార్చి 31 వరకు నీటి సరఫరా ఉంటుందని, డిసెంబర్‌ 31 నాటికి నారుమడులు, నాట్లు పూర్తి చేయాలన్నారు. జనవరి చివరి వారం నుంచి వారాబందీ అమలు చే స్తామని, జిల్లాలో 2.28 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి అందించాల్సి ఉందన్నారు. జేసీ కేఆర్‌ కల్పశ్రీ, ఇరిగేషన్‌ ఎస్‌ఈ గోపాల్‌, ఈఈ యు.రమేష్‌, వ్యవసాయాధికారి జి.సునీత పాల్గొన్నారు.

భీమవరం: భీమవరం బాలోత్సవం నాల్గో పిల్లల పండుగ వచ్చేనెల 19, 20 తేదీల్లో స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించనున్నట్టు ఇందూకురి ప్రసాదరాజు చెప్పారు. సోమవారం బాలోత్సవం కమిటీ సమావేశం స్థానిక గాంధీ భవన్‌లో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. భీమవరం రూరల్‌, అర్బన్‌, వీరవాసరం, పాలకోడేరు, ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాల బాలబాలికలకు నిర్వహించే బాలోత్సవంలో వ్యాసరచన, వక్తృత్వం చిత్రలేఖనం తదితర 16 అకడమిక్‌ అంశాలు, అభ్యుదయ గేయాలు, శాస్ట్రీయ, జానపద నృత్యాలు తదితర 15 కల్చరల్‌ అంశాలపై బాలోత్సవాలు నిర్వహిస్తామన్నారు. బ్రోచర్లు, ఎంట్రీ ఫారమ్స్‌ త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రధా న కార్యదర్శి సీహెచ్‌ పట్టాభిరామయ్య, ఉపాధ్యక్షుడు గాతల జేమ్స్‌, కోశాధికారి పి.సీతారామరాజు, కల్చరల్‌ కన్వీనర్‌ బి.చైతన్యప్రసాద్‌, అకడమిక్‌ కన్వీనర్‌ పి.శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: పుస్తకాల ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించవచ్చని జాయింట్‌ కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌ మె మోరియల్‌ శాఖా గ్రంథాలయంలో 59వ జాతీయస్థాయి గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం డిజిటల్‌ యుగంలో గ్రంథాలయాల ఆధునీకరణ, యువతలో పఠనాసక్తి పెంపు అనే అంశాలపై నిర్వహించిన కార్యక్ర మానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మహనీయుల జీవిత చరిత్రలను చదివే అలవాటు చేసుకోవాలన్నారు. గ్రంథాలయాధికారి ఎస్‌.వెంకటేశ్వరరావు, చెరుకువాడ వెంకటరామ య్య, ఇందుకూరి ప్రసాదరాజు, అల్లు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నరసాపురం: జిల్లాలో 18 గ్రంథాలయాలను పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్‌ చేశామని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జుత్తిగ నాగరాజు అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సోమవారం నరసాపురం ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 74 గ్రంథాలయాలు ఉన్నాయని, మిగిలిన వాటిని కూడా డిజిటలైజ్‌ చేస్తామన్నారు. పుస్తకాలను అందరికీ ఆన్‌లైన్‌ లో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. రూ.10 లక్షల విలువైన పోటీ పరీక్షల పుస్తకాలను గ్రంథాలయాలకు పంపిణీ చేశామన్నారు. షేక్‌ సిలార్‌సాహెబ్‌, ప్రొఫెసర్‌ కృష్ణమాచార్యులు, రంగినీడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement