శెట్టిబలిజలను భయపెడుతున్న ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

శెట్టిబలిజలను భయపెడుతున్న ఎమ్మెల్యే

Nov 17 2026 12:44 AM | Updated on Nov 17 2026 12:44 AM

శెట్టిబలిజలను భయపెడుతున్న ఎమ్మెల్యే

పెనుగొండ: సంఘాలు, కట్టుబాట్లు పేరుతో సొంత సామాజిక వర్గాన్నే (శెట్టిబలిజ) ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ భయపెడుతున్నారని మా జీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. సోమవారం పెనుగొండలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీరంగనాథరాజు మాట్లా డుతూ శెట్టిబలిజలు స్వాతంత్రంగా నడుచుకొనే పరిస్థితులు నియోజకవర్గంలో లేకుండా చేస్తున్నారన్నారు. శెట్టిబలిజలను వినియోగించుకోవడం తప్ప వారికి ఎమ్మెల్యే పితాని చేసిందేమీ లేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో శెట్టిబలిజ సామాజికవర్గానికి ఏఎంసీ చైర్మన్‌ పదవులు, 10 మందికి సొసైటీ చైర్మన్‌ పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. అలాగే శెట్టిబలిజ యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. ఎమ్మెల్యే పితాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచంట సొసైటీలో శెట్టిబలిజ కు లస్తుల ఉద్యోగాలు తొలగించారని విమర్శించారు. ములపర్రులో వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారన్న కారణంతో కులం నుంచి వెలివేశారని, ఇంకా వెలి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. నియోజకవర్గంలో బీసీలకు అండగా వైఎస్సార్‌సీపీ మాత్రమే ఉందన్నారు. కూటమి నాయకులు మా త్రం వారి అవసరాలకు అనుగుణంగా వ్యవహరి స్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారనని మండిపడ్డారు. అన్నివర్గాలకు న్యాయం చేయగలిగే పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమేనన్నారు. క్షేత్రస్థాయిలో అ భివృద్ధికి గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ బలపర్చిన అ భ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. పెను గొండ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థి నౌడు దుర్గారావు, మాజీ ఎంపీపీ పూతినీడి వెంకటేశ్వరరావు(పెద్ద), రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్రమౌళీశ్వరరెడ్డి, పోడూరి రామయ్య, నలిమిల్లి బాబిరెడ్డి, పలివెల శ్రీను, మణికంఠ, సుంకర నాగబాబు, చెవ్వేటి రాజు, ఆసునగరి, తిక్కిరెడ్డి పవన్‌, కుడిపూడి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement