పుర పోరుకు పుష్కరం | - | Sakshi
Sakshi News home page

పుర పోరుకు పుష్కరం

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

న్యూస్‌రీల్‌

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌

తొలి విడత పంచాయతీల్లోనూ ఎన్నికలు

శురకవారం శ్రీ 13 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షిప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమలో మళ్లీ మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగింది. పుష్కర కాలం తర్వాత నూతన పశ్చిమలో నాలుగు మున్సిపాల్టీలకు ఎన్నికలు జరుగనున్నాయి. అలాగే ఏలూరు జిల్లాలో నూతనంగా ఏర్పాటైన చింతలపూడి నగర పంచాయతీకి తొలి ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉమ్మడి పశ్చిమలో పంచాయతీ ఎన్నికలతో పాటే ఈ మున్సిపాల్టీ ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. మున్సిపల్‌ ఎన్నికలకు ఈనెల 14 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

విలీన వ్యవహారం తేలక..

పశ్చిమగోదావరిలోని తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు మున్సిపాల్టీల్లో 12 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగు మున్సిపాల్టీల్లో కలిపి 16 విలీన గ్రామాల వ్యవహారంపై కోర్టు కేసులు దాఖలు కావడంతో ఎన్నికలు 2019 నుంచి వాయిదా పడుతూ వచ్చాయి. చివరిగా 2014–19 కాలంలో పాలకవర్గం పనిచేసింది. అప్పటినుంచి అంటే ఏడేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలన సాగింది. వాస్తవానికి గత నెలలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌లోనే ఇక్కడ కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నా వార్డుల పెంపు, ఇతర కారణాలతో వాయిదా పడగా చివరకు గురువారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు.

వార్డుల విభజనతో..

చింతలపూడి నగర పంచాయతీలో గతంలో 20 వార్డులకుగాను ఇప్పుడు 23 వార్డులు, చైర్‌పర్సన్‌కు మొదటి సారి ఎన్నిక జరుగుతుంది. తణుకులో 34 వార్డులను 44కు, తాడేపల్లిగూడెంలో 35 వార్డులకు 48కు, భీమవరంలో 38 వార్డులకు 52కు, పాలకొల్లులో 35 వార్డులకు 44 వార్డులకు పెరిగాయి.

మున్సిపాలిటీలు: భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం

నగర పంచాయతీ: చింతలపూడి

నామినేషన్ల స్వీకరణ : ఈనెల 14, 15, 16

నామినేషన్ల పరిశీలన : 17న

నామినేషన్ల ఉపసంహరణ : 19 వరకు

తుది అభ్యర్థుల ప్రకటన : 19న

పోలింగ్‌ : 26న కౌంటింగ్‌: 30న

మున్సిపాలిటీ వార్డులు

భీమవరం 52

పాలకొల్లు 44

తణుకు 44

తాడేపల్లిగూడెం 48

చింతలపూడి 23

(నగర పంచాయతీ)

మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. నామినేషన్లు ఈ నెల 15 నుంచి 17 వరకు స్వీకరించి, 18న పరిశీలన, 21న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 26న పోలింగ్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో 544 పంచాయతీల్లో 5,696 వార్డు మెంబర్ల ఎన్నికల కోసం 5,821 పోలింగ్‌స్టేషన్లు ఖరారు చేశారు. మొదటి దశలో బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కామవరపుకోట, కొయ్యలగూడెం, కుక్కునూరు, పోలవరం, వేలేరుపాడు, టి.నర్సాపురం, చింతలపూడి, లింగపాలెం మండలాల్లోని 177 పంచాయతీలు, 1,896 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం 1,933 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేశారు. 26న ఎన్నికలు నిర్వహించి అదే రోజు కౌంటింగ్‌ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించనున్నారు.

పశ్చిమగోదావరిలోని 20 మండలాల్లో 393 పంచాయతీలు, 4,206 వార్డులకు 4,382 పోలింగ్‌ కేంద్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఆచంట, మొగల్తూరు, నర్సాపురం, పెనుమంట్ర, పెనుగొండ మండలాల్లోని 90 పంచాయతీలు 1,006 వార్డుల్లో ఎన్నికలకు 1,062 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మోగిన సైరన్‌

2014 తర్వాత నాలుగు మున్సిపాల్టీల్లో ఎన్నికలు

విలీన గ్రామాల కేసులతో ఏడేళ్లుగా ప్రత్యేక పాలన

నగర పంచాయతీగా చింతలపూడికి తొలి ఎన్నికలు

14 నుంచి నామినేషన్ల స్వీకరణ

26న పోలింగ్‌.. 30న కౌంటింగ్‌

తొలి విడత పంచాయతీ పోరుకూ ఏర్పాట్లు

ఫొటో: ఏఐ సృష్టించిన చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement