మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి న్యుమోనియాపై అవగాహన తప్పనిసరి అత్యవసర కేసులపై నిర్లక్ష్యం వద్దు అందుబాటులో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

భీమవరం అర్బన్‌: అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు కల్పించాలని భీమవరం సివిల్‌ జడ్జి ఎం.సుధారాణి అన్నారు. యనమదుర్రులోని సీతా పాలిటెక్నిక్‌ కళాశాలలో గురువారం మండల న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ము ఖ్య అతిథిగా ఆమె మాట్లాడుతూ మహిళలు వద్ద నుంచి కట్నం తీసుకోమని పురుషులు సంకల్పం చేయాలన్నారు. భారత రాజ్యాంగంలో మహిళలకు అనేక చట్టాలు అండగా ఉన్నాయన్నారు. పెండింగ్‌ కేసులను రాజీ చేసుకోవడానికి ప్రభుత్వం లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలు చట్టాలపై అవగాహన కల్పించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యేలేటి న్యూటన్‌, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ రామకృష్ణ, ప్యానల్‌ న్యాయవాదులు పి.అంబేడ్కర్‌, కె.సుబ్బరాజు, రూరల్‌ ఏఎస్‌ఐ వైవీ సత్యనారాయణ, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): న్యూమోనియా నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి ఆదేశించారు. గురువారం నుంచి వచ్చే ఫిబ్రవరి 28 వరకు నిర్వహించనున్న న్యుమోనియా నివారణ అవగాహన కార్యక్రమాల పోస్టర్లను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. న్యుమోనియా నివారణతో బాల్యానికి భరోసా కల్పించవచ్చని, చిన్నపిల్లలను వ్యాధి బారిన పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ ఎం.రవిబాబు, డాక్టర్‌ దేవసుధాలక్ష్మి, వైద్యులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లాలో మాతృ, శిశు మరణాలను సంపూర్ణంగా నివారించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జూలై, ఆగస్టు నెలల్లో సంభవించిన మాత, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. మరణాలకు గల కారణాలు, పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ప్రతి తల్లి, ప్రతి శిశువు ఆరోగ్యంగా ఉండేలా వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.రాంబాబు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పి.సూర్యనారాయణ, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు జి. మౌనిక, గైనకాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు.

లింగ నిర్ధారణ నేరం

కలెక్టరేట్‌లో పీసీ, పీఏడీటీ చట్టం అమలుపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని, కఠిన చర్యలు తప్పవని అన్నారు.

తాడేపల్లిగూడెం రూరల్‌: జిల్లాలో ధాన్యం కొ నుగోలు కేంద్రాలు రైతులకు అందుబాటులో ఉంచుతామని జాయింట్‌ కలెక్టర్‌ కేఆర్‌ కల్పశ్రీ అన్నారు. గురువారం కుంచనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ ఎం.సూర్యారావుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రంగు మారిన ధాన్యం, 33 శాతం కన్నా ఎక్కువ దెబ్బతిన్న ధాన్యాన్ని నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేస్తామన్నారు. అనంతరం తుపాను ప్రభావంతో నీట మునిగిన పంట నష్టం అంచనాలను పరిశీలించారు. వ్యవసాయ శాఖ జేడీ సునీత, డీఎస్‌ఓ సరోజిని, తహసీల్దార్‌ ఎం.సునీల్‌కుమార్‌, ఇన్‌చార్జి ఏడీఏ నారాయణరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement