ఏలూరులో అర్ధరాత్రి ఘాతుకం
పాతకక్షల నేపథ్యంలో దుండగులు అర్ధరాత్రి వేళ ఓ ఇంటిపై పెట్రోల్ బాటిళ్లతో దాడి చేసిన ఘటన ఏలూరులో కలకలం రేపింది. 8లో u
ఏలూరు (టూటౌన్): గిరిజన, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషిచేస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి డాక్టర్ పీవీ చలపతిరావు అన్నారు. గురువారం ఏలూ రు అటవీ డివిజన్ పరిధిలో ఆయన పర్యటించారు. ఏలూరు డివిజన్ కార్యాలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు అభివృద్ధి సదుపాయాలను ప్రారంభించారు. కన్నాపురం రేంజ్ పరిధిలోని ముంజులూరు బీసీ–111 ప్రాంతాన్ని సందర్శించారు. వెదురు ఆధారిత జీవనోపాధిని పెంపొందించేందుకు పలు అంశాలపై కీలక చర్చలు జరిపి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రకాశరావుపాలెం నగరవనం ప్రాజెక్టును సందర్శించారు. మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొని నగరవనం అభివృద్ధి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చే శారు. జిల్లాస్థాయిలో కార్తీక వనమహోత్సవం, వనభోజనాల కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. రాజమండ్రి సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణాధికారి జ్యోతి తుల్లిమెల్లి, జిల్లా అటవీ అధికారి పీవీ సందీప్ రెడ్డి, ఏపీఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ ఎ.సత్యకళ, జంగారెడ్డిగూడెం, కన్నాపురం, ఏలూరు రేంజ్ అధికారులు తదితరులు ఉన్నారు.


