నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల | - | Sakshi
Sakshi News home page

నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

నాణ్యత డొల్ల.. రోడ్డు గుల్ల

● చించినాడ వంతెనపై నాసిరకం మరమ్మతులు ● కొన్ని నెలలకే గోతులమయం

చించినాడ గోదావరి వంతెనపై దెబ్బతిన్న రోడ్డు, తారు కొట్టుకుపోవడంతో బయటపడిన శ్లాబు

యలమంచిలి: చించినాడ వశిష్ట గోదావరి వంతెన మరమ్మతుల పేరిట అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి పక్కాగా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఏడాది పాటు రాకపోకలు బంద్‌ చేసి, రూ.కోట్లు వెచ్చించినా చివరకు నాసిరకం పనులతో సరిపెట్టారని వాహనదారులు మండిపడుతున్నారు.

అక్రమాల కంపు.. అధికారుల నిర్లక్ష్యం

ఏడాది కాలం పాటు చుట్టూ తిరిగి వెళ్తూ ప్రజలు పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అంత ఓపిక పడితే చివరికి వేసింది నాసిరకం తారు రోడ్డేనని తేలిపోయింది. రూ.కోట్లు కుమ్మరించి చేసిన పనులు కనీసం కొన్ని నెలలు కూడా తట్టుకోలేకపోయాయి. వంతెనపై భారీ గోతులు పడి వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

అధికారులు నిద్రపోతున్నారా?

పనులు జరుగుతున్నప్పుడు కనీస పర్యవేక్షణ లేకుండా నాసిరకం మెటీరియల్‌ వాడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు పంచుకోవడంలో ఉన్న శ్రద్ధ.. రోడ్డు నాణ్యతపై ఏమైందని జనం నిలదీస్తున్నారు. నిధుల అక్రమ మళ్లింపు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై తక్షణమే ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని, నాసిరకం పనులకు బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేయడంతో పా టు కాంట్రాక్ట్‌ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. వెంటనే వంతెనపై నాణ్యమైన రీ–సర్ఫేసింగ్‌ పనులు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement