కూటమి నాయకుల హైడ్రామాలేంటి..? | - | Sakshi
Sakshi News home page

కూటమి నాయకుల హైడ్రామాలేంటి..?

Nov 13 2026 12:28 AM | Updated on Nov 13 2026 12:28 AM

తాడేపల్లిగూడెం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్యాయం జరిగింది వైఎస్సార్‌సీపీకి అయితే.. కూటమి నాయకుల హైడ్రామాలేంటని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ వడ్డి రఘురాం ప్రశ్నించారు. పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కౌంటింగ్‌లో కూటమి నాయకులు ఇష్టారీతిన వ్యవహరించారని మండిపడ్డారు. కౌంటింగ్‌ హాలులోకి కూటమి నాయకుల ఫోన్లను అనుమతించిన అధికారులు వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల ఫోన్లను అనుమతించకపోవడంలో ఆంతర్యమేంటన్నారు. వెంకట్రామన్నగూడెం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఓటమిపై కూటమి నాయకులు రోజుకో సమావేశం పెట్టి హైడ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే కుమారుడికి చెందిన విద్యాసంస్థ బస్సుల్లో బ్యాలెట్‌ బాక్సులను తరలించారని, దీంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు స్ట్రాంగ్‌ రూమ్‌ వరకు వెళ్లి బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసే వరకు ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కడియద్దలో తమ అభ్యర్థి గెలిస్తే.. జనసేన అభ్యర్థి గెలుపుకోసం రీ కౌంటింగ్‌ చేయించారని, వీటికి సంబంధించిన సీసీ పుటేజ్‌లు రప్పించాలని రఘురాం డిమాండ్‌ చేశారు. జగన్నాథపురం–2 స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిస్తే రీకౌంటింగ్‌ చేయించారని ఇది సరైన విధానమేనా అని ప్రశ్నించారు. వెంకట్రామన్నగూడెం టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పరిమి రవికుమార్‌ కౌంటింగ్‌ హాల్‌లో ఫోన్‌ మాట్లాడారని, ఆర్వోతో కూడా ఫోన్‌ మాట్లాడించారని, అధికారు లు దీనికి సమాధానం చెప్పాలన్నారు. తహసీల్దార్‌, పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించలేదని, వారిని సస్పెండ్‌ చేయాలని టీడీపీ కన్వీనర్‌ వలవల బాబ్జీ అంటున్నారని, ఆ మాత్రం దానికి ఎన్నికలు నిర్వహించడం ఎందుకన్నారు. కూటమి లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా వైఎస్సార్‌సీపీ దడ పుట్టించిందన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం కూటమి పార్టీలకు ఉందా అని రఘురాం ప్రశ్నించారు.

ప్రజల్లో గెలిచా.. కుట్రలో ఓడిపోయా..

వైఎస్సార్‌సీపీ కడియద్ద ఎంపీటీసీగా బరిలో నిలిచి కూటమి కుట్రలో ఓడిపోయానని కొండపల్లి నాగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఓటుతో తాను గె లిచినట్టు అధికారులు చెప్పి.. రీకౌంటింగ్‌ పేరుతో ఫలితాన్ని జనసేనకు అనుకూలంగా మార్చారని ఆరోపించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదని, కన్నీళ్లు పెట్టుకుని వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. అయి నా తనకు ప్రజల్లో గెలిచాననే సంతృప్తి ఉందన్నా రు. వెంకట్రామన్నగూడెం కౌంటింగ్‌ ప్రక్రియ గు రించి పోలింగ్‌ ఏజెంట్‌ పోలిమోను శ్రీనివాసు వివరించారు. పెంటపాడు, గూడెం మండలంలో ఎంపీటీసీ. జెడ్పీటీసీ ఎన్నికలు జరిగిన తీరు గురించి కై గాల శ్రీనివాసు, చిట్టూరి బాపన్న మాట్లాడారు. నాయకులు గుండుమోగుల బలుసులరావు, వీర్ల గోవిందు, కై గాల శ్రీనివాసు, చిట్టూరి బాపన్న, మద్దుకూరి మెహెర్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున గెలిచిన ఎంపీటీసీలను అభినందించారు.

‘పరిషత్‌’ కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీకి అన్యాయం

కౌంటింగ్‌ వీడియోలు బహిర్గతం చేయాలి

వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం కన్వీనర్‌ వడ్డి రఘురాం డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement