తాడేపల్లిగూడెం (టీఓసీ): ఉద్యాన పంటల సాగుకు తేనెటీగల పెంపకం అత్యంత ముఖ్యమని, నాణ్యమైన తేనె ఉత్పత్తి ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు తెలిపారు. వెంకట్రామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా శాసీ్త్రయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై నిర్వహించనున్న వారం రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు. నవంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. మొదటి బ్యాచ్: నవంబర్ 16 నుండి 22 వరకు, రెండో బ్యాచ్: డిసెంబర్ 14 నుండి 20 వరకు, మూడో బ్యాచ్: ఫిబ్రవరి 1 నుండి 13 వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. ప్రతి బ్యాచ్‌లో 25 మందికి శాసీ్త్రయ పద్ధతిలో శిక్షణనిచ్చి, ఉచితంగా భోజన వసతులు కల్పిస్తామని, ఉద్యాన రైతులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే 24 రకాల పరికరాలు, తేనెటీగల పెట్టెలను రాయితీపై అందిస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న వారు ఆధార్ కార్డు, ఫోన్ నంబరు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్. కిరణ్‌కుమార్ (73826 33692), శాస్త్రవేత్త డాక్టర్ కె. అర్చన (95024 35151) నంబర్లను సంప్రదించాలని పేర్కొన్నారు.


