వేలేరుపాడులో మళ్లీ పెద్ద పులి కలకలం | - | Sakshi
Sakshi News home page

వేలేరుపాడులో మళ్లీ పెద్ద పులి కలకలం

Nov 11 2026 3:45 AM | Updated on Nov 11 2026 3:45 AM

పెద్ద పులి చేతిలో హతమైన పశువులు

వేలేరుపాడు: కుక్కునూరు అటవీ రేంజ్‌ పరిధిలోని వేలేరుపాడు మండలంలో పెద్దపులి సంచారం మరోసారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. మంగళవారం కొత్తూరు, నార్లవరం గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున కొత్తూరు గ్రామానికి చెందిన కరటం బ్రహ్మయ్యకు చెందిన ఒక ఆవు, రెండు లేగదూడలను పులి హతమార్చింది. అనంతరం అక్కడి నుంచి గుళ్ళమడుగు, తెల్లిపల్లి అటవీ ప్రాంతంలోని గుట్టల వైపు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పులి కదలికలను రేడియో కాలర్‌ సిగ్నల్‌ ద్వారా రెండు అటవీ బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, పశువులను అడవులకు పంపవద్దని, రాత్రి సమయాల్లో బయటికి తిరగవద్దని, ఎటు వెళ్లినా గుంపులుగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement