భీమవరం : క్రీడాకారులను ప్రోత్సహించడానికి కాస్మోపాలిటన్ క్లబ్ కృషి అభినందనీయమని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. పట్టణంలోని కాస్మోపాలిటన్ క్లబ్‌లో ఏఐటీఏ మెన్, ఉమెన్ జాతీయస్థాయి టెన్నిస్ టోర్నీ విజేతలకు శనివారం బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ నాగరాణి హా జరై మాట్లాడుతూ క్రీడల నిర్వహణకు అందిస్తున్న ప్రోత్సాహం స్ఫూర్తిదాయకమన్నారు. కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కా స్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ రామభద్రిరాజు, టోర్నమెంట్ కమిటీ చైర్మన్ యు.కృష్ణప్రసాద్, వైస్ చైర్మన్ టి.కృష్ణబాబు, బీహెచ్ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
పురుషుల సింగిల్స్‌లో డి.శ్రీకర్, మహిళల సింగిల్స్‌లో హర్షిణి నాగరాజ్, మెన్స్ డబుల్స్‌లో ఐ.ప్రసాద్–పరితోష్ పవార్, ఉమెన్స్ డబుల్స్‌లో జనని రమేష్–హర్షిణి నాగరాజ్ విజేతలుగా నిలిచారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ) : పెదతాడేపల్లికి చెందిన ఆలపాటి విజయ్ షైనీ ఐఎన్‌ఐ సెట్‌లో ఆలిండియా 52వ ర్యాంక్ సాధించా రు. న్యూఢిల్లీలోని ఏఐఐఎంఎస్‌తో పాటు దేశంలోని వైద్య విద్యాసంస్థల్లో ఎండీ, ఎంఎస్, ఎండీఎస్, డీఎం వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐఎన్‌ఐ సెట్ నిర్వహిస్తారు. జీఎస్‌ఎల్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటా సీటు సాధించడం సంతోషంగా ఉందని షైనీ అన్నారు.
పెంటపాడు : తమ పాఠశాల విద్యార్థిని సీహెచ్ శ్రీవిద్య రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్టు పెంటపాడు బేసిక్ స్కూల్ హెచ్‌ఎం దాట్ల పద్మజ తెలిపారు. శనివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థినిని అభినందించారు. ఈనెల 13న కోనసీమ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో ప్రాతినిధ్యం వహిస్తుందని, శ్రీవిద్యను, పీడీ పోశియ్యను అభినందించారు. ఎంఈఓలు టీవీ రామకృష్ణ, ఎం.శ్రీనివాస్ కూడా వీరిని అభినందించారు.
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం, తణుకు మండలాల్లోని ఎర్రకాలువ, యనమదుర్రు వరద నీరు రెండు రోజుల్లో తగ్గుముఖం పడుతుందని శెట్టిపేట ఇరిగేషన్ ఈఈ రమేష్‌బాబు తెలిపారు. తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఎం.సూర్యారావుతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నందమూరు అక్విడెక్ట్ నుంచి 40 వేల క్యూసెక్కుల వరద సాఫీగా వెళ్లే అవకాశం ఉందన్నారు. 2018లో మాత్రమే 40 వేల క్యూసెక్కుల వరద రాగా.. ఇప్పుడు 96 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందన్నారు. నందమూరు అక్విడెక్ట్టుకు ముందు నాలుగు, యనమదుర్రు డ్రెయిన్‌కు మూడు గండ్లు పడటంతో వరద పొలాలు, గ్రామాలను ముంచెత్తిందన్నారు. కొంగు వారిగూడెం నుంచి నందమూరు ఆక్విడెక్టు వరకు వరద చేరడానికి 12 గంటల వరకు సమయం పడుతుందని, ఫ్లాష్ ఫ్లడ్స్‌తో ఒక్కసారిగా వరదనీరు ముంచెత్తిందన్నారు. ప్రస్తు తం నందమూరు అక్విడెక్ట్ వద్ద 38.4 అడుగు ల నీటిమట్టం ఉందన్నారు. శెట్టిపేటకు ఎగువన కొవ్వాడ కాలువకు గండ్లు పడటంతో వెస్ట్రన్ కెనాల్, యనమదుర్రు కాలువలను నీటి మట్టం నిర్వహణలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందన్నారు.
బుట్టాయగూడెం: భారీ వర్షాలతో ఏజెన్సీ ప్రాంతంలోని జల్లేరు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 10 గంటలకు స్పిల్ వే ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 217.80 మీటర్లు కాగా.. ప్రస్తుతం 217 మీటర్లకు చేరుకుంది. జలాశయంలోకి ప్రస్తుతం 208 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అప్రమత్తమైన అధికారులు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని నీటిపారుదల శాఖ అధికారి సురేష్ హెచ్చరించారు.


