ఎంపీటీసీ కౌంటింగ్‌లో హైడ్రామా | - | Sakshi
Sakshi News home page

ఎంపీటీసీ కౌంటింగ్‌లో హైడ్రామా

Nov 8 2026 10:36 AM | Updated on Nov 8 2026 10:36 AM

నాలుగు ఓట్లతో వైఎస్సార్‌సీపీ వెంక్రటామన్నగూడెం అభ్యర్థి విజయం

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెంలో నన్నయ వర్సిటీలో జరిగిన ఎంపీటీసీ కౌంటింగ్‌ ప్రక్రియలో వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట ఎంపీటీసీ అభ్యర్థి విష యంలో హైడ్రామా సాగించారు. ఇన్‌వాలీడ్‌ ఓట్ల బండిల్‌ను ఒక ఉద్యోగి టీడీపీ అభ్యర్థి పరిమి రవికుమార్‌ ఓట్లలో కలిపారు. ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న రవి కి వత్తాసు పలికిన ఉద్యోగి బండారం బయట కు పొక్కింది. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థి పత్సా రామచంద్రయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. రీ కౌంటింగ్‌ అనంతరం రామచంద్రయ్య ఐదు ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అయినా అధికారులు విజేతగా ప్రకటించకుండా నిబంధనలు, మార్గదర్శకాలు అంటూ జా ప్యం చేశారు. పరిశీలకులు, జాయింట్‌ కలెక్టర్‌ కు ఫిర్యాదులు వెళ్లడంతో ఆమె కౌంటింగ్‌ కేంద్రానికి వచ్చారు. తర్వాత ఈ వ్యవహారంపై ఇద్దరు అభ్యర్థుల వాదనలను అధికారులు వి న్నారు. అనంతరం అభ్యర్థులు నేరుగా పత్రాల ను మరోమారు పరిశీలించుకొనేందుకు అవకా శం ఇచ్చారు. ఇదే తరుణంలో నిబంధనలకు వి రుద్ధంగా భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వలవల బాబ్జీ కౌంటింగ్‌ కేంద్రంలోకి వచ్చారు. ఆయన్ను పోలీసులు అనుమతించడంపై విమర్శలు వచ్చాయి. బాబ్జీ వచ్చి వెళ్లిన తర్వాత పత్రాల పరిశీలనలో అధికారుల వైఖరి మారినట్టుగానూ విమర్శలు వ చ్చాయి. విషయం తెలిసిన తాడేపల్లిగూడెం ని యోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ వడ్డి రఘు రాం కేంద్రానికి చేరుకుని జేసీ పోలింగ్‌ అధికారులు, పోలీసులతో మాట్లాడారు. ఫలితాలను తారుమారు చేయాలని చూస్తే ఆందోళనలను చవిచూడాల్సి వస్తుందని, సామరస్యంగా పరిష్కరించాలని కోరారు. చివరకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామచంద్రయ్య నాలుగు ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement