తాడేపల్లిగూడెం రూరల్: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని వైఎస్సార్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వడ్డి రఘురాంనాయుడు కోరారు. శుక్రవారం రాత్రి మండలంలోని చినతాడేపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీ టీసీ అభ్యర్థులు సబ్బితి చిన్నమ్మ, కాసాని లలిత శా రదా భ్రమరాంబతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడు తూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. మాజీ ఉప స ర్పంచ్ చిట్టూరి కాశి, నాయకులు గొర్రెల శ్రీనివాస్, ప్రేమ్ కిరణ్‌రెడ్డి, వట్టి బుజ్జి, పిచ్చుకల సాయి, కాసాని సోమేశ్వరరావు, బ్రహ్మయ్య, లంకా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ గూడెం ఇన్‌చార్జి రఘురాం
సాక్షి, భీమవరం: మద్యం నుంచి సంపద సృష్టే లక్ష్యంగా విచ్చలవిడిగా సాగిస్తున్న మద్యం అమ్మకాలతో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మద్యం మత్తులో మందుబాబులు దాడులు, హత్యలకు తెగబడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వెలుగుచూడని, పోలీస్‌స్టేషన్ వరకు చేరని ఘటనలు మరెన్నో ఉన్నాయి.
నెలకు రూ.150 కోట్ల టార్గెట్
జిల్లాలో 193 మద్యం దుకాణాలకు గాను ఇటీవల 176 షాపులు రెన్యువల్ చేసుకున్నారు. సాధారణంగా రోజుకు రూ.4 కోట్ల చొప్పున నెలకు దాదాపు రూ. 120 కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా. గతంలోని ప్రభుత్వ పాలసీతో పోలిస్తే కూటమి ప్రైవేట్ పాలసీ తెచ్చాక 25 శాతం మేర లిక్కర్, 80 శాతం మేర బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం ఎకై ్సజ్ శాఖకు భారీగా టార్గెట్లు పెడుతోంది. నెలకు జిల్లాలో రూ.150 కోట్లకు పైగా అమ్మకాలు చేయాలని లక్ష్యంగా నిర్ణయిస్తున్నట్టు సమాచారం. ఈ టార్గెట్‌ను చేరేందుకు నిబంధన అమలులో అధికారులు చూసీచూడనట్టు ఉంటున్నారు. ఇదే అదనుగా లిక్కర్ సిండికేట్లు ఎకై ్సజ్ పాలసీని తుంగలోకి తొక్కుతున్నాయి. ఎంఆర్‌పీకి మించి బాటిల్‌పై రూ.10లు అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టు షాపులు, లూజ్ సేల్స్, నైట్‌పాయింట్లు పేరిట వేళాపాలా లేకుండా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.
శాంతి భద్రతలకు విఘాతం
గత ప్రభుత్వంలో ఊరికి దూరంగా ఉన్న మద్యం దుకాణాలు కూటమి తెచ్చిన ప్రైవేట్ పాలసీతో జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లోకి వచ్చేశాయి. ఏనీ టైం ఎక్కడపడితే మద్యం దొరికే పరిస్థితులు ఉ న్నాయి. వేళాపాలా లేకుండా మందుబాబులు మత్తులో జోగుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నా రు. ఒక్కోసారి హత్యలకు సైతం దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. జనావాసాల్లోని షాపుల వద్ద మందుబాబుల ఆగడాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
గతంలో మద్యం దుకాణాలు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో కచ్చితంగా నిబంధనలు అమలయ్యేవి. ఎంఆర్‌పీకే మద్యం అమ్మకాలు చేసేవారు. నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు జరిగేవి. షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకుపోవడమే తప్ప అక్కడే కూర్చుని తాగే వీలుండేది కాదు. బెల్టుషాపులకు ఆస్కారమే లేదు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు.


