ప్రభుత్వ తీరుతో రైతులకు తీరని నష్టం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ తీరుతో రైతులకు తీరని నష్టం

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

ప్రభుత్వ తీరుతో రైతులకు తీరని నష్టం

పెనుగొండ: కూటమి ప్రభుత్వ తీరుతో తుపాను తాకిడికి నష్టపోయిన రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. అర్నబ్‌ తుపాను తాకిడితో ఆచంట నియోజకవర్గంలో పెనుగొండ, ఆచంట మండలాల్లో నేలనంటిన వరిచేలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నేల నంటిన వరిచేల దు బ్బులను చూపిస్తూ ఈనిక దశ పూర్తయి, పాలు పోసుకొంటున్న దశలో తుపానుతో పూర్తిగా నష్ట పోయామని రైతులు వాపోయారు. ఇప్పటికే ఎకరాకు రూ.40 వేల వరకు పెట్టుబడులు పెట్టామని, మరో నెల రోజుల్లో పంట చేతికంది వస్తుందన్న సమయంలో తుపాను ముంచేసిందన్నారు. నేలనంటిన వరి దుబ్బులను నిలబెట్టేందుకు ఎకరాకు రూ. 15 వేల వరకు ఖర్చవుతుందన్నారు. పంట దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు. దీంతో పంటల బీమాపై శ్రీరంగనాథరాజు ఆరా తీశారు. పంటలపై రుణాలు తీసుకొన్నవారు మాత్రమే బీమా చేయించారని, మిగిలిన వారిలో కనీసం 10 శాతం మంది కూడా బీమా చేయలేదని, దీంతో రైతులు పూర్తిగా నష్టపోయే ప్రమాదముందని శ్రీరంగనాథరాజు అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పంటల బీమా మొత్తం ప్రభుత్వమే నేరుగా చెల్లించిందని, కూటమి ప్రభుత్వం విధానాన్ని మార్చి రైతులే చెల్లించాలనడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం నిబంధనలు సడలించి ప్రతి రైతుకూ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి పెట్టుబడిని నష్ట పరిహారంగా చెల్లించాలన్నారు. రైతులను మభ్యపెట్టడమే తప్ప సంక్షేమం అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మేడపాటి సాయి చంద్రమౌళీశ్వరరెడ్డి, మండల కన్వీనరు నల్లిమిల్లి వేణు ప్రతాపరెడ్డి(బాబీ), నాయకులు కుడుపూడి సుబ్రహ్మణ్యం, ఆకిశెట్టి చంటి, చిటికెన బాబీ, యెల్లా సుబ్బరావు, మడ్డు శ్రీనివాసరావు, నూలి పవన్‌, దొరారెడ్డి, నాయకులు ఉన్నారు.

మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement