అరకమ మద్యంపై నిరంతర నిఘా | - | Sakshi
Sakshi News home page

అరకమ మద్యంపై నిరంతర నిఘా

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

అరకమ మద్యంపై నిరంతర నిఘా

ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌కుమార్‌ మీనా

ఏలూరు టౌన్‌: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలు, సరఫరాపై మరింత పటిష్ట నిఘా ఉంచాలనీ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని రెవెన్యూ, ఎకై ్సజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముఖేష్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. స్థానిక అబ్కారీ మద్య నియంత్రణ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్‌ అధికారులతో శుక్రవారం ఆయన కమిషనర్‌ చామకుర్తి శ్రీధర్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌దేశ్‌ శర్మతో కలిసి సమీక్షించారు. అక్రమ మద్యం, సారా నియంత్రణకు చేపట్టిన చర్యలపై ఆ రా తీశారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సారా త యారీ, విక్రయాలపై అధికారులను అడిగి తెలుసు కున్నారు. జిల్లాలో సారాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే మత్తు పదార్థాలు, సారా తయారీని నిరోధించాలని చెప్పారు. మద్యం విక్రయాలపై పటిష్ట చర్యలు చేపట్టాల న్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ మద్యం దుకాణాలను మూసివేయించాలనీ, కోడ్‌ పాటించా లని ఆదేశించారు. డి ప్యూటీ కమిషనర్‌ బి.శ్రీలత, అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రభుకుమార్‌, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి ఎ.అవులయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement