40 వేల ఎకరాల్లో వరికి ముప్పు | - | Sakshi
Sakshi News home page

40 వేల ఎకరాల్లో వరికి ముప్పు

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

40 వేల ఎకరాల్లో వరికి ముప్పు ఉత్సాహంగా రోల్‌ప్లే పోటీలు ‘పశ్చిమ’ విజేతలు వీరే.. కూటమి నేతలకు చేదు అనుభవం పోలింగ్‌కు సర్వం సిద్ధం

భీమడోలు: తుపాను ప్రభావంతో ఏలూరు జిల్లాలో 40 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్‌ బాషా అన్నారు. సూరప్పగూడెంలో దెబ్బతిన్న పంటను శుక్రవారం ఏఓ ఎస్‌పీవీ ఉషారాణితో కలిసి ఆయన పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయశాఖ సిబ్బంది పంట నష్టం అంచనాలను రూపొందించే పనిలో ఉందన్నారు. రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. పాలు పోసుకునే దశలో ఉన్న పొలాలకు పొడ తెగులు సోకే అవకాశం ఉందని, ప్రోపికోనజోల్‌ మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల చొప్పున పిచి కారీ చేయాలని సూచించారు. అలాగే ఐదు శా తం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. భీ మడోలు మండలంలో 12,850 ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 2 వేల ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టపోయిందన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాస్థాయి రోల్‌ప్లే, ఫోక్‌ డ్యాన్స్‌ పోటీలు దూబచర్ల డైట్‌ కాలేజీలో శుక్రవారం నిర్వహించినట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.కమలకుమారి ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రోల్‌ప్లే పోటీల్లో భీమడోలు జెడ్పీ హైస్కూల్‌, నాగిరెడ్డిగూడెం ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌, పెదనిండ్రకొలను జెడ్పీ హైస్కూల్‌ మొదటి మూడు స్థానాల్లో దెందులూరు జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు కన్సొలేషన్‌ బహుమతులు గెలుచుకున్నారు. ఫోక్‌ డాన్స్‌ పోటీల్లో పంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్‌, భీమడోలు జెడ్పీ హైస్కూల్‌, లక్కవరం జెడ్పీ హై స్కూల్‌ మొదటి మూడు స్థానాల్లో, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థులు కన్సొలేషన్‌ బహుమతులు గెలుచుకున్నారు. వీరంతా వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. జిల్లా నోడల్‌ అధికారి కేఎస్‌వీకే రాజకుమార్‌ పర్యవేక్షించారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): దూబచర్ల విద్యా శిక్షణ సంస్థలో జరిగిన జిల్లాస్థాయి రోల్‌ ప్లే, ఫోక్‌ డాన్స్‌–2026 పోటీల విజేతల వివరాలను తాడేపల్లిగూడెం డీవైఈఓ కార్యాలయం నుంచి ప్రకటనలో తెలియజేశారు. ఫోక్‌ డాన్స్‌లో.. ఉండి మండలం పాందువ్వ జెడ్పీ హైస్కూల్‌, పెంటపాడు మండలం దర్శిపర్రు జెడ్పీ హైస్కూల్‌, తాడేపల్లిగూడెం ఈవీఎం మున్సిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులు మొదటి మూడు స్థానాల్లో నిలి చారు. రోల్‌ప్లేలో పాందువ్వ జెడ్పీ హైస్కూల్‌, దర్శిపర్రు జెడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు మొద టి రెండు స్థానాల్లో నిలిచారు. వీరికి దూబచర్ల డైట్‌ ప్రిన్సిపాల్‌ ఎం.కమలకుమారి ప్రశంసా పత్రాలు అందించారు.

ద్వారకాతిరుమల: స్థానిక చెరువు వీధిలో టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున శుక్రవారం సాయంత్రం ఓట్లు అడిగేందుకు వెళ్లిన కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. నెలల తరబడి డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని గంగాధరరావు అనే యువకుడు నాయకులను నిలదీశాడు. చెరువు వద్ద మలుపులో రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఎలా వస్తారని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారి గా కంగుతిన్న నేతలు.. సమస్యల పరిష్కార బాధ్యతను పంచాయతీ కార్యదర్శిపై నెట్టేసి, గంగాధరరావును బుజ్జగించి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో నగరపాలక, పురపాలక సంఘాల పోలింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఎం.వెంకట శేషగిరిబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా కు తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం కమిషనర్‌ పునేఠా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్‌ నుంచి శేషగిరిబాబు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement