దేవరపల్లి: నల్లజర్ల మండలంలోని దూబచర్ల వద్ద కూలీలతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన శీలం వీర్రాజు, శీలం వెంకటేశ్వరరావు, శీలం ప్రసాద్ శుక్రవారం పనుల నిమిత్తం దూబచర్లకు వచ్చారు. సాయంత్రం తిరిగి వ్యాన్‌పై స్వగ్రామం వెళ్తుండగా, మార్గమధ్యంలో వ్యాన్ టైర్ ఫంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..


