మోసం చేశారు | - | Sakshi
Sakshi News home page

మోసం చేశారు

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

మోసం చేశారు సేవలకు విలువ లేదా? కడుపుమంట ఊరికే పోదు ఇంటింటికీ సేవలందించాను ●

ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం వస్తే మా జీతాలు పెంచి, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని నమ్మబలికారు. తీరా గెలిచాక మమ్మల్ని పూర్తిగా విస్మరించారు. జగనన్న ప్రభుత్వంలో ఎంతోమందికి సేవ చేశాం. ప్రస్తుత ప్రభుత్వం మా ఆవేదనను గుర్తించాలి.

– గొల్లపల్లి దుర్గాప్రసాద్‌

మోదుగ్గుంట, తాడేపల్లిగూడెం మండలం

రూ. 5 వేల జీతంతో సేవా దృక్పథంతో పనిచేశాం. రూ. 10 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. మాకు ఇచ్చే వేతనం దండగ అన్నవారు, ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రచారానికి లక్షలు ఇవ్వడం దారుణం. కరోనా సమయంలో మేము అందించిన సేవలను ఏ డబ్బుతోనూ కొలవలేరు.

– కుడిపూడి కుమారస్వామి, చిట్టవరం

కరోనా, వరదల సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. నేను నిండు గర్భిణీగా ఉన్నప్పుడే వరద నీటిలో దిగి బాధితులకు సహాయం అందించాను. అటువంటి మాకు జీతాలు ఇవ్వడానికి మనస్కరించని ప్రభుత్వానికి, సెల్‌ ఫోన్లలో పోస్టులు పెట్టే ఇన్‌ఫ్లుయెన్సర్లకు వేలకు వేలు ఇవ్వడానికి చేతులు వస్తున్నాయి.

– గొల్లమందుల రోఖ్యా పెదలంక, యలమంచిలి మండలం

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందించాను. కానీ కూటమి ప్రభుత్వం పింఛన్‌ దరఖాస్తు పూర్తి చేయించే వారు లేక అవ్వా, తాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కానీ కూటమికి చీమకుట్టినట్లు లేదు. వలంటీర్లను తీయకుండా వేతనం రెట్టింపు చేస్తానని మాట ఇచ్చి తప్పారు.

– ఎం.ప్రసాద్‌, పడమరవిప్పర్రు, పెంటపాడు మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement