రేచర్లలో బొగ్గు తవ్వకాలపై నిరసన | - | Sakshi
Sakshi News home page

రేచర్లలో బొగ్గు తవ్వకాలపై నిరసన

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

చింతలపూడి: చట్టాలు చేయాల్సిన ప్రభుత్వాలే నిబంధనలను తుంగలో తొక్కితే సామాన్య ప్రజలను, రాజ్యాంగ వ్యవస్థలను ఎవరు రక్షిస్తారని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ ప్రశ్నించారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలోని ఎస్టీ కాలనీ పరిధిలో బొగ్గు వెలికితీత కోసం రైతుల అనుమతి లేకుండా అధికారులు భూ పరిశీలనకు రావడంపై మంగళవారం స్థానికులు, ప్రజాప్రతినిధులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దొంతా కృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా గ్రామసభలు నిర్వహించి ప్రజామోదం పొందాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను గుడ్డిగా అమలు చేస్తున్న అధికారులు తమ బాధ్యతలను పునరాలోచించుకోవాలని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ డాక్టర్‌ బి.రాంబాబు నాయక్‌ మాట్లాడుతూ రిలయన్స్‌ వంటి కార్పొరేట్‌ సంస్థల లాభాల కోసం ప్రజల జీవించే హక్కును కాలరాయడం దారుణమన్నారు. ప్రాణాలను బలితీసుకుని సాధించే అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. రిలయన్స్‌ సంస్థకు ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని, బొగ్గు తవ్వకాల ప్రతిపాదనలను శాశ్వతంగా విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement