ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి అండర్–19 పోటీలకు సెయింట్ థెరిస్సా జూనియర్ కళాశాలకు చెందిన 20 మంది విద్యార్థినులు కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్ జట్లకు ఎంపికయ్యారు. స్థానికంగా జరిగిన జిల్లా జట్ల ఎంపికలో వీరు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ లూర్థుమేరీ తెలిపారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థినులను ఆమెతో పాటు వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ శిరీష, ఇతర అతిథులు అభినందించారు. కళాశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ విభాగ అధిపతి ఐ. ఆండాళ్ళు, అండర్–19 స్పోర్ట్స్ సెక్రటరీ కె.జయరాజు పాల్గొన్నారు.


