వలస పక్షులతో కొల్లేరు కళకళ | - | Sakshi
Sakshi News home page

వలస పక్షులతో కొల్లేరు కళకళ

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామమైన ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రం కొత్త అందాలను సంతరించుకుంది. ప్రతిఏటా అక్టోబరు నుంచి మార్చి వరకు విదేశీ వలస పక్షులు ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తి జరుపుకుంటాయి. ప్రస్తుతం ఈ కేంద్రానికి పక్షుల రాక మొదలైంది. ఇటీవల కురిసిన వర్షాలకు విహార చెరువు నిండుకుండలా మారింది. అటవీశాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ ఇనుప స్టాండ్లపై అరుదైన పెలికాన్లు, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షుల రెక్కల చప్పుళ్లు కనువిందు చేస్తున్నాయి. మూడు నెలల విరామం తర్వాత పర్యాటకుల కోసం బోటు షికారును తిరిగి ప్రారంభించారు.

విస్తీర్ణం

ఆటపాక విహార కేంద్రంలో 280 ఎకరాల విస్తీర్ణంలో పక్షుల చెరువు ఉంది. పక్షుల కోసం అటవీశాఖ 152 కృత్రిమ ఇనుప స్టాండ్లు ఏర్పాటు చేయగా, పాడైన 32 స్టాండ్ల స్థానంలో కొత్తవి అమర్చారు. పక్షుల అందాలను దగ్గర నుంచి వీక్షించడానికి మూడు బోట్లు అందుబాటులో ఉన్నాయి.

పక్షుల అత్తారిల్లు కొల్లేరు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రామ్‌సర్‌ సదస్సు గుర్తించిన ఏకై క చిత్తడి నేలల ప్రాంతం కొల్లేరు. ఇది 2,22,300 ఎకరాల్లో విస్తరించి ఉంది. జిల్లాల్లో ఆటపాక, మాదవాపురం పక్షుల విహార కేంద్రాలు ప్రసిద్ధమైనవి. కై కలూరు మండలం ఆటపాకలో పెలికాన్‌ పక్షులు అధికంగా రావడంతో దీనిని ’పెలికాన్‌ ప్యారడైజ్‌’ అంటారు. రాష్ట్ర ప్రభుత్వం పెలికాన్‌ను అటవీశాఖ అంబాసిడర్‌గా గుర్తించింది.

విదేశీ అతిథులు

కొల్లేరులో మొత్తం 210 పక్షి జాతులు సంచరిస్తుండగా, వీటిలో రష్యా, బ్రిటన్‌, సైబీరియా, బంగ్లాదేశ్‌, నైజీరియా, ఆస్ట్రేలియా, శ్రీలంక తదితర దేశాల నుంచి 71 జాతులకు చెందిన సుమారు 1.20 లక్షల వలస పక్షులు వస్తాయని అంచనా.

ప్రధాన వలస పక్షులు

కామన్‌ శాండ్‌ పైపర్‌ (ఉల్లంకి పిట్ట), బ్లాక్‌ కింగ్‌ఫిషర్‌ (నల్లతల బుచ్చిగాడు), నార్తరన్‌ ఫిన్‌టైల్‌(సూది తోక బాతు), రెడ్‌ క్రిస్టడ్‌ ఫోచర్డ్‌ (ఎర్రతల చిలుక), కామన్‌ రెండ్‌ షాంక్‌ (ఎర్రకాళ్ళ ఉల్లంకి), కాస్నియడ్‌ టర్న్‌ (సముద్రపు కాకి), గ్రేటర్‌ శాండ్‌ ప్లోవర్‌ (పెద్ద ఇసుక ఉల్లంకి), డూప్‌ (ఈల వేసే పెద్ద చిలువ), గుల్‌ బిల్‌ టర్న్‌ (గౌరి కాకి ముక్కు రేవు పిట్ట), బ్రాహ్మణి షెల్‌ డక్‌ (బాపన బాతు), మార్స్‌ శాండ్‌పైపర్‌ (చిత్తండి ఉల్లంకి), గ్రేట్‌ వైట్‌ పెలికాన్‌ (తెల్ల చిలువ బాతు) వంటివి ఇక్కడకు విచ్చేస్తాయి.

నిండుకుండలా ఆటపాక పక్షుల విహార కేంద్రం

మూడు నెలల తర్వాత బోటు షికారు

పెలికాన్‌, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షుల కేరింతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement