ఎస్‌ఎంసీ ఎన్నికల్లో తమ్ముళ్ల దౌర్జన్యం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీ ఎన్నికల్లో తమ్ముళ్ల దౌర్జన్యం

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

ముదినేపల్లి రూరల్‌: పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలను సైతం తెలుగు తమ్ముళ్లు రాజకీయమయం చేసేశారు. పెద్దగా ప్రాధాన్యత లేని ఈ ఎన్నికల్లో సైతం ఓటమిని జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు అక్రమ పద్ధతుల్లో ఎన్నిక వాయిదా పడేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని సింగరాయపాలెం జెడ్పీ హైస్కూల్‌ ఎస్‌ఎంసీ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల తల్లిదండ్రులు 15 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా, ఈ సభ్యులు అనంతరం చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఎన్నిక ప్రారంభం కాగానే తొలుత నలుగురు సభ్యులను ఎన్నుకున్నారు. వీరంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు కావడంతో టీడీపీ వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో టీడీపీకి ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలోకి ప్రవేశించి, ఎన్నిక వాయిదా వేయాలంటూ ప్రధానోపాధ్యాయురాలు, ఎంఈవోను డిమాండ్‌ చేశారు. ఇది సాధ్యపడదని చెప్పడంతో ఎన్నిక వాయిదాకు మరో ఎత్తుగడ వేశారు. ఓటు వేసేందుకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రుల్లో టీడీపీ మద్దతుదారులను ఎన్నికలు బహిష్కరించాలని కోరడంతో పాటు, తటస్థులను సైతం బెదిరించి బయటకు తీసుకువచ్చారు. దీంతో కోరం లేక విధిలేని పరిస్థితుల్లో అధికారులు ఎన్నికను వాయిదా వేయాల్సి వచ్చింది.

పోలీసుల ప్రేక్షక పాత్ర

ఈ పరిణామంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోయిన రామరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలోకి ఓటు హక్కు ఉన్న తల్లిదండ్రులు తప్ప ఇతరులు ప్రవేశించకూడదని, అయినప్పటికీ టీడీపీ వర్గీయులు లోపలికి ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించేందుకు వచ్చిన ఎస్సై సమక్షంలోనే టీడీపీ వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎస్సై ప్రేక్షక పాత్ర వహించడంలోని ఆంతర్యం ఏమిటని నిలదీశారు. తక్షణమే తెలుగు తమ్ముళ్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

సింగరాయపాలెం జెడ్పీ హైస్కూల్‌లో కోరం లేక ఎన్నిక వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement