కొల్లేరు సమాచారాన్ని అక్టోబర్‌ 5లోగా సమర్పించాలి | - | Sakshi
Sakshi News home page

కొల్లేరు సమాచారాన్ని అక్టోబర్‌ 5లోగా సమర్పించాలి

Sep 29 2026 1:09 AM | Updated on Sep 29 2026 1:09 AM

కొల్లేరు సమాచారాన్ని అక్టోబర్‌ 5లోగా సమర్పించాలి

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి సంబంధించి కేంద్ర సాధికార కమిటీ కోరిన పూర్తి సమాచారాన్ని అక్టోబర్‌ 5వ తేదీలోగా సమర్పించాలని పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతీలాల్‌ దండే అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌ గౌతమి సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కాంతీలాల్‌ దండే మాట్లాడుతూ, కొల్లేరు 5వ కాంటూర్‌ పరిధిలోని అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణ, జిరాయితీ, డీ–ఫారం భూమిదారుల పునరావాస కార్యక్రమాలపై రూపొందించిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టు కమిటీకి సమర్పించామన్నారు. ఈ నివేదికను పరిశీలించిన కమిటీ మరికొంత సమాచారం కోరిందని తెలిపారు. సంరక్షణ కేంద్రం ప్రస్తుత విస్తీర్ణం, సరిహద్దుల హేతుబద్ధీకరణ తర్వాత భూముల వివరాలు, జిరాయితీదారుల తరలింపునకు మండలాల వారీగా ప్రతిపాదిత భూములు, జిల్లా, మండలాల సరిహద్దులు, ప్రభుత్వ, జిరాయితీ, డీ–పట్టా భూములు, ఉప్పెటేరు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పక్షుల ప్రాంతాలు, నోటిఫైడ్‌, నాన్‌–నోటిఫైడ్‌ డ్రైన్ల వంటి అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు ఈ వివరాలను అక్టోబర్‌ 5లోగా కలెక్టర్‌కు ఇవ్వాలని, ఏలూరు జిల్లా కలెక్టర్‌ అక్టోబర్‌ 6 నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్లు ఎంజే అభిషేక్‌ గౌడ, కేఆర్‌ కల్పశ్రీ, డీఎఫ్‌ఓలు సందీప్‌ రెడ్డి, త్రిమూర్తులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement