భీమవరం: గాంధీ జయంతిని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన ఆన్‌లైన్ చిత్రలేఖన పోటీల విజేతల వివరాలను మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు సోమవారం పత్రికలకు విడుదల చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో విద్యార్థులకు ‘మహాత్మాగాంధీ సత్యం, అహింస విధానాలు నేటి పరిస్థితులు’ అనేక అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. వీటిలో 21 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయగా విజేతలకు అక్టోబర్ 2న నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులోని మహాత్మాగాంధీ భవనంలో బహుమతులు అందజేస్తామని ప్రసాదరాజు చెప్పారు.
పాఠశాల స్ధాయి విజేతల వివరాలు
జి దేవవర్షిణి (అనాకోడేరు), ఎస్ చాన్‌బాబు (జీలకర్రగూడెం), పి జయశ్రీ (వట్లూరు), జి.ప్రీతిక (భీమవరం), కె.ప్రవల్లిక (మేడపాడు), జి.అర్చన (కామవరపుకోట), కె.గాయత్రి (పెనుమంట్ర), జె.సంయుక్త (తాడేపల్లిగూడెం), ఎస్.లూధర్ (దర్శిపర్రు), కె.చంద్రిక (పెదనిండ్రకొలను), బి.షైనీ (ఆకివీడు), కె.స్నేహ (పాలకోడేరు), సీహెచ్ దీవెన (పత్తేపురం), ఆర్.చరణతేజ (చినఅమిరం), పి సాయిలక్ష్మి (బలుసుమూడి), కె.లహరి (పెదఅమిరం).
కళాశాల స్థాయి విజేతల వివరాలు
జి.భానుశ్రీ (పెన్నాడ), కె.షణ్ముక్ (ఏలూరు), వి.మీరాసహస్ర (తాడేపల్లిగూడెం), కె లీలాప్రసన్న (తణుకు), బి.వెంకటలక్ష్మి (భీమవరం).


