యువత.. ఉత్సాహ భరిత | - | Sakshi
Sakshi News home page

యువత.. ఉత్సాహ భరిత

Sep 27 2026 1:28 AM | Updated on Sep 27 2026 1:28 AM

భీమవరం: ఫోక్‌ డ్యాన్సులు.. ఫోక్‌ సాంగులు.. కావ్యరూపకాలు.. వీధి నాటికలతో విద్యార్థులు అదరగొట్టారు.. పొయిట్రీలు.. పెయింటింగ్‌లతో ఆకట్టుకున్నారు.. భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం యువజన సర్వీసుల శాఖ, సెట్‌వెల్‌ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు కళలు, సంస్కృతి వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. కళల్లో నైపుణ్యంతో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అనంతరం విద్యార్థులకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), సెట్‌వెల్‌ సీఈఓ కేఎస్‌ ప్రభాకరరావు, కళాశాల డైరెక్టర్‌ ఎం.జగపతిరాజు, ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ బీఆర్‌కే వర్మ, యూత్‌ కో–ఆర్డినేటర్‌ గాదిరాజు హరీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

● కావ్యరూపకం: బి.కుమార్‌ బృందం (ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌), రేణుక బృందం (పాలకొల్లు డీఎన్నార్‌).

● ఫోక్‌ సాంగ్‌ గ్రూప్‌: బి.సునీత బృందం (భీమవరం డీఎన్నార్‌), మధు బృందం (నరసాపురం వైఎన్‌ కళాశాల).

● ఫోక్‌ డాన్స్‌ గ్రూప్‌: హాసిని బృందం (డీఎన్నార్‌), భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ విద్యార్థులు.

● పొయిట్రీ: ఆర్‌.విష్ణువర్ధన్‌ (ఎస్‌ఆర్‌కేఆర్‌), బి.రాధాకుమారి (ఎస్‌కేఎస్‌డీ తణుకు), వి.మోహన్‌ సాయి చరణ్‌ (ఎస్‌ఆర్‌కేఆర్‌).

● కూచిపూడి నాట్యం: ఎన్‌ఎస్‌ఎస్‌ నాగదేవిశ్రీ (ఎస్‌ఆర్‌కేఆర్‌), టి.కౌశిక్‌ కౌశిన మృణాళినిదేవి (డీఎన్నార్‌), ఆర్‌.అనన్య (ఎస్‌ఆర్‌కేఆర్‌).

● వివిధ విభాగాల్లో: కె.మోహన్‌ ప్రియ, ఎం.హసీనా, మహాలక్ష్మి, ఎం.లాస్య

జిల్లాస్థాయి యువజనోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement