పెనుగొండ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పెనుమంట్ర మాజీ ఎంపీపీ కర్రి వెంకట నారాయణరెడ్డి (వాసు రెడ్డి), వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంటు)గా పోడూరు మాజీ జెడ్పీటీసీ, జెడ్పీ మాజీ ఫ్లోర్‌లీడర్ గుంటూరి పెద్దిరాజును నియమించారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీలో గుర్తింపుగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, రాష్ట్ర అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు వీరిద్దరూ కృతజ్ఞతలు తెలిపారు. ఆచంట నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరికి అభినందనలు తెలిపారు.


