భీమవరంలో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు | - | Sakshi
Sakshi News home page

భీమవరంలో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

భీమవరంలో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు

తణుకు అర్బన్‌ : భీమవరం అంబేద్కర్‌ భవన్‌లో వచ్చేనెల 6, 7 తేదీల్లో నిర్వహించనున్న ఏఐటీయూసీ జిల్లా 12వ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్‌న్‌లో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, కార్మిక సంక్షేమం తదితర అంశాలపై మహాసభల్లో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్కమాంబ టెక్స్‌టైల్స్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు దేవ పెద్దిరాజు, సత్యనారాయణ స్పిన్నింగ్‌ మిల్స్‌ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సహాయ కార్యదర్శి చింతన సాయిరాం, తణుకు మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి మందుల ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement