తణుకు అర్బన్: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు. మంగళవారం తణుకు బార్ అసోసియేషన్ భవనం వద్ద ఈనెల 26న భీమవరంలో నిర్వహించనున్న మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బింకం రవికుమార్ మాట్లాడుతూ ఆలిండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదుల కోసం, న్యాయ విద్యార్థులు, న్యాయ అధ్యాపకులు, ప్రజా సమస్యలపైనా పనిచేసే సంఘం అని అన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యుడు కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయవాదులకు కూటమి ప్రభుత్వం వృత్తి రక్షణ చట్టాన్ని చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు పొట్ల సురేష్, జి.అంబేడ్కర్, కొండా శ్రీనివాసరావు, కె.స్వామి, షేక్ అబ్దుల్ రహీం, తానేటి వెంకటేశ్వరావు, ఈదర జ్యోతి బాబు, వి.మురళి పాల్గొన్నారు.


