రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Sep 23 2026 1:19 AM | Updated on Sep 23 2026 1:19 AM

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

తాడేపల్లిగూడెం: గూడెం నుంచి రాజమండ్రి వెళ్తున్న రైలు నుంచి జారిపడటం వల్ల కాని, లేదా ట్రాక్‌ దాటుతున్న సమయంలో రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి (సుమారు 50 ఏళ్లు) మంగళవారం మృతిచెందినట్లు గూడెం రైల్వే పోలీసులు తెలిపారు. స్థానిక పాతూరు సుబ్బారాయుడి గుడి సమీపంలో రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఆయన శరీరంపై కంఠం మీద పుండు ఉంది. రెండు చేతులు తెగి వేరుపడగా, కుడి కాలు పాదం వేరైంది. తల వెనుక, కంఠం వద్ద బలమైన రక్తగాయాలయ్యాయి. మృతుని ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని వెల్లడించారు. మృతుడికి సంబంధించి వివరాలు తెలిసిన వారు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ డి. వెంకటేశ్వరరావు 80191 57528 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement