ఆటో డ్రైవర్‌ వేధింపులతో బాలిక ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ వేధింపులతో బాలిక ఆత్మహత్య

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

ఆటో డ్రైవర్‌ వేధింపులతో బాలిక ఆత్మహత్య పుట్టగొడుగుల సాగుతో ఉపాధి

భీమవరం: ఆటో డ్రైవర్‌ వేధింపులు తట్టుకోలేక 14 ఏళ్ల బాలిక సీలింగ్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం ఒకటో పట్టణానికి చెందిన బాలిక స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ పాఠశాలకు తీసుకెళ్లే ఆటో డ్రైవర్‌ తన కుమార్తెను ప్రలోభపెట్టాడని, తన మాట వినకపోతే చంపుతానని లేదా చచ్చిపోవాలని బెదిరించడం వల్లే బాలిక ఆత్మహత్య చేసుకుందని తండ్రి నాగరాజు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ రమేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తాడేపల్లిగూడెం: గ్రామీణ యువత, మహిళలు, రైతులకు పుట్టగొడుగుల పెంపకం ద్వారా మంచి ఉపాధి లభిస్తుందని ప్రొఫెసర్‌ టి.నాగలక్ష్మి తెలిపారు. వెంకట్రామన్నగూడెంలో జరుగుతున్న పుట్టగొడుగుల సాగు శిక్షణ కార్యక్రమంలో సోమవారం రెండో రోజు పలువురు శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. నాగలక్ష్మి సాగు పద్ధతులు, అనుకూల పరిస్థితులు, ఉత్పత్తి విధానాలపై మార్గదర్శనం చేయగా.. ప్లాంట్‌ పాథాలజీ శాస్త్రవేత్త జే. దివ్య వ్యాధుల గుర్తింపు, నివారణ, సమగ్ర యాజమాన్య పద్ధతులను వివరించారు. తీరప్రాంతాల్లో సాగు, మార్కెటింగ్‌, డిమాండ్‌పై ఉద్యాన పరిశోధన స్థానం ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ శేషకిరణ్‌, ఉపాధి అవకాశాలపై ఉద్యాన వర్సిటీ విస్తరణ సంచాలకులు సీహెచ్‌.రూత్‌ మాట్లాడారు. అనంతరం శిక్షణార్థులకు ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చారు. కెవికె శాస్త్రవేత్త కె.అర్చన కోర్సు కో–ఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement