తరుగు లేకుండా పక్కాగా తూకం వేయాలి | - | Sakshi
Sakshi News home page

తరుగు లేకుండా పక్కాగా తూకం వేయాలి

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

తరుగు లేకుండా పక్కాగా తూకం వేయాలి

జంగారెడ్డిగూడెం (చింతలపూడి): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యూఆర్‌ కోడ్‌ విధానం నేపథ్యంలో ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద తమకు తరుగు లేకుండా పక్కాగా కాటా వేసి బియ్యం ఇవ్వాలని రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేశారు. సోమవారం జంగారెడ్డిగూడెం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు చేరుకున్న జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం మండలాల డీలర్లు, డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ)ని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్దే పూర్తి చేయాల్సిన స్కానింగ్‌ భారాన్ని కూడా తమపైనే వేస్తున్నారని వాపోయారు. ప్రతి బస్తానూ స్కాన్‌ చేసి లోడింగ్‌, అన్‌లోడింగ్‌ చేయాల్సి వస్తున్నందున, హమాలీలు సైతం తరుగు లేకుండా తూకం వేసి సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement