కూటమి వంచనపై ‘బీసీ గర్జన’ | - | Sakshi
Sakshi News home page

కూటమి వంచనపై ‘బీసీ గర్జన’

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కవురు పిలుపు

భీమవరం: వెనుకబడిన తరగతులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, రాజమహేంద్రవరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహించే శ్రీవెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన్ఙ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ శెట్టిబలిజ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కవురు శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. శనివారం భీమవరం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీసీ నాయకుల సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కవురు శ్రీనివాస్‌ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుంటూ, అన్ని రకాలుగా వంచించిందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ పథకాన్ని అమలు చేయకుండా బుట్టదాఖలు చేశారని విమర్శించారు.

బ్యాక్‌బోన్‌గా బీసీలు

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో బీసీలను బ్యాక్‌బోన్‌ వర్గాలుగా గుర్తించి ఆర్థికంగా, రాజకీయంగా అండగా నిలిచారని గుర్తుచేశారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వల్ల అనేకమంది బీసీ యువకులు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కాగలిగారని, జగన్‌ కూడా అదే బాటలో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారన్నారు. బీసీలకు పూర్వవైభవం రావాలంటే జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

విజయవంతానికి సమష్టి కృషి

భీమవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు మాట్లాడుతూ ఎన్నికల హామీలను విస్మరించిన కూటమికి నిరసనగా నిర్వహించాఏ బీసీ గర్జనకు నాయకులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేండ్ర వెంకటస్వామి, బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి కోడే యుగంధర్‌ మాట్లాడుతూ మండల, పట్టణాల వారీగా బీసీలను సమీకరించి సభకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లేలా కార్యచరణ రూపొందించాలని కోరారు. అనంతరం శ్రీవెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన్ఙ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ భీమవరం పట్టణ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య, బీసీ నాయకులు పిల్లి వీరేశ్వరరావు, రుద్రాక్షల శ్రీనివాసరావు, కడలి శ్రీరాములు, రేవు రాంబాబు, తిరుమాని బాలచంద్రుడు, వీరవల్లి రాధాకృష్ణ, మతల కాశీవిశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement