5న ‘బతుకు పోరాట గర్జన’ | - | Sakshi
Sakshi News home page

5న ‘బతుకు పోరాట గర్జన’

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

భీమవరం: కల్లుగీత కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 5న భీమవరం ఎకై ్సజ్‌ కార్యాలయం వద్ద నిర్వహించే బతుకు పోరాట గర్జనను జయప్రదం చేయాలని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి పిలుపునిచ్చారు. శనివారం భీమవరంలో కామన మునిస్వామి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మద్యం కార్పొ రేట్లకు ఎర్రతివాచీలు పరుస్తూ, సాంప్రదాయ కల్లుగీత వృత్తిపై వివక్ష చూపుతోందని మండిపడ్డారు. గీత సొసైటీలకు 20 శాతం మద్యం షాపులు కేటాయిస్తామన్న హామీని విస్మరించారని విమర్శించారు. ఆదరణ–3 పథకం ప్రచారానికే పరిమితమైందని, విచ్చలవిడిగా బెల్ట్‌ షాపులు ఏర్పాటు చేయడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులంతా ఈ పోరాటంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బొక్కా చంటి, కడలి పాండు, సహాయ కార్యదర్శులు దాసరి సూరిబాబు, బొంతు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement