ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలనేది దశాబ్దాల నాటి కోరిక. ఈ ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 ఏప్రిల్ 16న సఖినేటిపల్లిలో రూ. 194 కోట్లతో ఈ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్న మైథాస్ (సత్యం) సంస్థ ఆర్థిక సంక్షోభంలో పడడం, ఆ తర్వాత వైఎస్సార్ అకాల మరణంతో పనులు ఆగిపోయాయి. అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసలు పట్టించుకోలేదు. 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ పనులను పట్టాలెక్కించారు. న్యాయపరమైన చిక్కులు తొలగి, ప్రస్తుతం టెండర్లు ఖరారు కావడంతో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


