లింగపాలెం: ఖరగ్‌పూర్ నుంచి అమరావతి మీదుగా ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని లింగపాలెం మండలానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలోని ఆసన్నగూడెం, వేములపల్లి, ముడిచెర్ల గ్రామాల పరిధిలో హైవే వెళ్తుండటంతో ఆసన్నగూడెంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఏకై క జీవనాధారమైన పంట భూములు కోల్పోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైవే మ్యాప్‌ను మార్చాలని, లేదా ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని లేదంటే ప్రత్యామ్నాయంగా భూమికి బదులు భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఫారెస్ట్ భూముల్లో సాగు హక్కులు కల్పించడంతో పాటు, పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


