రైలు నుంచి జారిపడిన యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడిన యువకుడి మృతి

Sep 20 2026 1:27 AM | Updated on Sep 20 2026 1:27 AM

ఏలూరు టౌన్‌: ఏలూరు పవర్‌పేట రైల్వే ఫ్లాట్‌ఫాం సమీపంలో రైలు నుంచి పడిపోయినట్లు భావిస్తున్న గుర్తుతెలియని యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండవచ్చని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు చామనచాయ, నల్లటి జుట్టు, కోలముఖం కలిగి ఉన్నాడు. శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని రైలు నుంచి పవర్‌పేట ఫ్లాట్‌ఫాం సమీపంలో పడిపోయిన యువకుడిని ట్రాక్‌మెన్‌, నైట్‌బీట్‌ పోలీసులు గుర్తించి 108 అంబులెన్స్‌లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలించగా, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏలూరు జీఆర్‌పీ పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు ఏలూరు జీఆర్‌పీ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎంఎస్‌ఎన్‌. ప్రసాద్‌ 99891 09912 నంబరులో సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

ఉంగుటూరు: చేబ్రోలు రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడికి సుమారు 50 సంవత్సరాల వయసు ఉంటుందని, 5.6 అడుగుల ఎత్తు, ఛామనచాయ రంగు కలిగి ఉన్నాడని, తెల్లని నిలువు చారల షర్టు, ఎరుపు రంగు నైట్‌ ప్యాంటు ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ డి. వెంకటేశ్వరరావు 80191 57528 లేదా ఎస్సై అప్పారావు 92475 85733 నంబర్లలో తెలియజేయాలని కోరారు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ ఫిర్యాదు మేరకు రైల్వే ఎస్సై పి. అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement