● కుప్పకూలి వ్యక్తి మృతి
● ఎల్.అగ్రహారంలో విషాదం
తాడేపల్లిగూడెం రూరల్ : మండలంలోని ఎల్. అగ్రహారం టిడ్కో గృహ సముదాయంలో మరో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న కాకర్లమూడి ఏసు (48) శనివారం తాడేపల్లిగూడెం పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డులో ట్యాక్సీ ఓనర్స్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన డీజే సౌండ్ బాక్స్‌ల ముందు ఏసు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఏసు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతునికి భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వచ్చే నెల కుమార్తె వివాహం చేయాల్సి ఉండగా, అంతలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


