భీమవరం: ఆలయ భూములను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేస్తూ వెబ్ ల్యాండ్‌లో నమోదు చేయాలని జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.హరి సూర్యప్రకాష్ అన్నారు. జిల్లాలో ఆలయ ఈఓలతో శుక్రవారం భీమవరంలో సమావేశం నిర్వహించారు. ఆడిట్ నివేదికల్లో అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశానికి హిందూ ఆలయాల పరిరక్షణ సమితి సభ్యులు హాజరై ఆలయాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆలయ ఆస్తులను పరిరక్షించాలని కోరారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పిల్లాడి రుద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొత్తూరి రామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు, చైతన్య వర్మ తదితరులు పాల్గొన్నారు.


